నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు థియేటర్లు మూతపడినప్పటికీ నాని సినిమా బాగానే కలెక్ట్ చేసింది.అక్కడ ఏరియాల్లోనూ ఈ మధ్య కాలంలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ నిలిచింది.
ఒకసారి 12 రోజుల కలెక్షన్లని గమనిస్తే :
నైజాం | 9.08 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 2.14 cr |
ఈస్ట్ | 0.99 cr |
వెస్ట్ | 0.86 cr |
గుంటూరు | 1.20 cr |
కృష్ణా | 0.95 cr |
నెల్లూరు | 0.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.90 Cr |
ఓవర్సీస్ | 3.43 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 24.65 cr |
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.22 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను ఆల్రెడీ రీచ్ అయిన ఈ చిత్రం 12 రోజులు పూర్తయ్యేసరికి రూ.24.65 కోట్ల షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.2.65 కోట్ల లాభాలను అందించింది. నిన్న కూడా ఈ చిత్రం రూ.0.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.
నాని గత చిత్రాలు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వి’ ‘టక్ జగదీష్’ వంటివి నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. టికెట్ రేట్ల ఇష్యు లేకపోయి ఉంటే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!