నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని దూసుకుపోతుంది.వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం స్టడీగా కలెక్ట్ చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదలైనప్పటికీ అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది.
ఒకసారి ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
7.55 cr
సీడెడ్
1.95 cr
ఉత్తరాంధ్ర
1.67 cr
ఈస్ట్
0.75 cr
వెస్ట్
0.60 cr
గుంటూరు
0.91 cr
కృష్ణా
0.69 cr
నెల్లూరు
0.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.85 Cr
ఓవర్సీస్
3.25 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
20.65 cr
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి అని ముందుగా ట్రేడ్ పండితులు చెప్పారు.అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడటం జరిగింది. దాంతో మళ్ళీ బిజినెస్ లో అడ్జస్ట్ మెంట్ లు జరిగాయి. ఈ క్రమంలో రూ.22 కోట్లకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
ఇక 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.65 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ కి ‘శ్యామ్ సింగ రాయ్’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తుంది.