Shyamala Devi: గుండెల్ని పిండేసే కామెంట్లు చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి…వీడియో వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్ ను పూర్తిగా విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఫస్ట్ జనరేషన్ స్టార్ హీరోల్లో జీవించి ఉన్న కృష్ణ మరణంతో ఆ తరం శకం ముగిసినట్టు అయ్యింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా అందరూ మరణించారు. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు, కృష్ణ ల మధ్య బాండింగ్ ఎక్కువ. కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు…

ఇక కృష్ణ కూడా తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు కన్నుమూయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించడానికి వచ్చిన కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కన్నీటి పర్యంతం అయ్యారు. అంతేకాదు ఆమె చేసిన కామెంట్స్ అందరితో కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. “కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరిదీ మంచి అనుబంధం. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నారు.

వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒకేసారి వెళ్ళిపోవాలి అనుకున్నారేమో అందుకే కలిసి వెళ్ళిపోయారు” అంటూ శ్యామల దేవి గారు కన్నీటి పర్యంతం అయ్యారు.ఆమె చేసిన కామెంట్స్ అభిమానుల గుండెల్ని పిండేసే విధంగా ఉన్నాయని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలోని కృష్ణ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత 12:30 నుంచి గచ్చిబౌలి నుండి పద్మాలయ స్టూడియోస్ కి కృష్ణ అంతిమయాత్ర జరగనుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus