మళ్ళీ తెరపైకి ప్రభాస్ పెళ్లి.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య శ్యామల దేవి!

ప్రభాస్ పెళ్లి టాపిక్ తరచూ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ప్రభాస్ ఇక పెళ్లి చేసుకోడు అని అభిమానులు చాలా వరకు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ కుటుంబ సభ్యులకు తప్పదు కదా.. ప్రభాస్ ను పెళ్లికి ఒప్పించడానికి వారు చేయని ప్రయత్నాలు అయితే లేవు. ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణంరాజు మరణించి 6 నెలలు పూర్తికావస్తోంది. సో వాళ్ళ సంప్రదాయం ప్రకారం మరో 6 నెలలు గడిస్తేనే కానీ పెళ్లి చేసుకోకూడదు అనే నియమం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈలోపు ప్రభాస్ కోసం సంబంధాలు చూడాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు అని సమాచారం. గతంలో కృష్ణంరాజు… శతవిధాలా ప్రయత్నించినా ప్రభాస్ ను పెళ్ళికి ఒప్పించలేకపోయారు. ఆ టైంలో కృష్ణంరాజు భార్య అయిన శ్యామలా దేవి గారు ప్రభాస్ పెళ్లి విషయంలో కల్పించుకుంది లేదు. అయితే ఇప్పుడు ఆమె కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కృష్ణంరాజుకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీళ్లకు పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉంది.

వీళ్ళ పెళ్లిలో కన్యాదానం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభాస్ పై ఉంది. ‘దీంతో త్వరగా పెళ్లి చేసుకో నాన్న’ అంటూ ప్రభాస్ ను శ్యామల దేవి గారు అడిగితే.. ‘చెల్లెళ్లకు పెళ్లి చేసిన తర్వాత చేసుకుంటాను. అన్నయ్య వదినలతో కన్యాదానం చేయించండి’ అంటూ ప్రభాస్ ఆమెకు చెబుతున్నాడట. దీంతో శ్యామల దేవి.. ప్రభాస్ పై మండిపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ ‘ప్రాజెక్ట్ కె’ ‘సలార్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus