కృష్ణంరాజు, ప్రభాస్ ల గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపిన శ్యామలా దేవి..!

  • March 8, 2019 / 06:48 PM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఎన్నో హిట్టు చిత్రాల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు కృష్ణంరాజు. ఆయన వ్యక్తిత్వం గురించి ప్రతీ ఒక్కరూ కథలు… కథలు గా చెబుతూ ఉంటారు. అప్పట్లో అయన ఇంటికొచ్చిన అభిమానులని భోజనం పెట్టి కానీ బయటకి పంపేవారు కాదట. ఇక కృష్ణంరాజు గారి గురించి ఆయన భార్య కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి గారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక కృష్ణంరాజు,ప్రభాస్, ల గురించి శ్యామలా దేవి మాట్లాడుతూ.. “కృష్ణంరాజుగారితో మాట్లాడటానికి ఎవరైనా సరే చాలా భయపడతారు. ఆయన రూపం అంత గంభీరమైనది .. ఆయన వాయిస్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఒక్కసారి ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఆయన అభిమానులు కాకుండా తిరిగివెళ్ళరు. అంతటి అభిమానం చూపుతూ మాట్లాడతారాయన. ఆయన ఎంతటి సున్నిత మనస్కుడు అనేది ఆయనతో మాట్లాడిన తరువాతనే అర్థమవుతుంది. స్త్రీలంటే ఆయనకి ఎంతో గౌరవం .. అదే పద్ధతి ప్రభాస్ కి కూడా వచ్చింది. పెళ్లికి ముందు నన్ను చూడటానికి కృష్ణంరాజుగారు తన కజిన్ ను పంపించారు. ఆ సమయంలో నేను చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాను. ఆయన వెళ్లి అదే విషయం చెప్పారట. ‘చిన్నపిల్లలతో ఆడుకునేవారి మనస్తత్వం మంచిదై ఉంటుంది .. పెళ్లికి ఓకే చెప్పండి’ అని కృష్ణంరాజుగారు అన్నారట” అంటూ తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus