Siddharth, Aditi: సిద్దార్థ్ అదితి అలా పెళ్లి చేసుకోబోతున్నారా.. ఏం జరిగిందంటే?

కొన్ని వారాల క్రితం సిద్దార్థ్ అదితీరావు హైదరీ రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రైవేట్ గా నిశ్చితార్థం చేసుకున్నామని చెబుతున్నా మీడియా మాత్రం సీక్రెట్ అని చెబుతోంది. అయితే ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో పెళ్లి కూడా అదే విధంగా జరిగేలా సిద్ధార్థ్ (Siddharth)  అదితి  (Aditi Rao Hydari) ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ముంబైలో అదితీరావు హైదరీ ఇప్పటికే పెళ్లి పనులను మొదలుపెట్టారని సమాచారం అందుతోంది.

డిజైనర్లతో చర్చలు సాగించడంతో పాటు సమయం దొరికినప్పుడల్లా అదితి ముంబైలో షాపింగ్ చేస్తున్నారు. ఎక్కువగా మేకప్ స్టూడియోల చుట్టూ తిరుగుతున్న అదితి పెళ్లి కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? ఎప్పుడు చేసుకుంటారు? అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. సిద్దార్థ్ వయస్సు 45 సంవత్సరాలు కాగా అదితీరావు హైదరీ వయస్సు 37 సంవత్సరాలు కావడం గమనార్హం.

సిద్దార్థ్, అదితి మధ్య ఏజ్ గ్యాప్ 8 సంవత్సరాలు కాగా వీళ్లిద్దరూ యంగ్ గా కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత సిద్దార్థ్, అదితి అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్థ్ అదితి మధ్య ప్రేమ మొదలైంది. అటు సిద్దార్థ్ కు ఇటు అదితికి ఈ పెళ్లి రెండో పెళ్లి కాగా పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టాలని ఈ జోడీ భావిస్తున్నారు. సిద్దార్థ్ కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు తగ్గినా సిద్దార్థ్ కు మాత్రం అడపాదడపా మూవీ ఆఫర్లు అయితే వస్తున్నాయి.

సిద్దార్థ్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండగా ఇండియన్2 సినిమాలో సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సిద్దార్థ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. పెళ్లి తర్వాత అదితి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus