Siddharth, Aditi: సిద్ధార్థ్ అదితి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది అయితే ఇదివరకే వీరిద్దరూ వేరే వ్యక్తులను వివాహం చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే వీరి గురించి ఎన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ వార్తలపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలా క్లారిటీ ఇవ్వకుండానే వీరిద్దరూ పెద్ద ఎత్తున కలిసి కెమెరా కంటికి కనబడుతున్నారు. విదేశాలకు వెకేషన్ వెళ్లిన, పార్టీలకు వెళ్లిన రెస్టారెంట్లకు వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని

అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు అంటూ ఎంతోమంది వీరి రిలేషన్ పై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా న్యూ ఇయర్స్ సందర్భంగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటో కనుక చూస్తే వీరిద్దరూ తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా విదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నటువంటి ఫోటోని షేర్ చేయడమే కాకుండా హ్యాపీ గ్రేట్ ఫుల్ అంటూ ఈ ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్ చూస్తే వీరిద్దరూ తమ రిలేషన్ ని ప్రకటించారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సిద్ధార్థ్ (Siddharth) అదితి ఇద్దరూ కూడా తమ రిలేషన్ ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus