రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరు కానీ కొంతమంది స్టార్ల నిజ జీవితంలో సినిమాలను మించిన ట్విస్టులతో కూడిన సంఘటనలు జరుగుతుంటాయి.. బ్రెడ్ విరిగి బటర్‌లో పడిందోమో తెలియదు కానీ నాలుగు పదుల వయసు దాటినా సిద్ధార్థ్ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి లవ్ స్టోరీస్ కానిచ్చేస్తున్నాడు..
ప్రేమ పేరుతో ముద్దుగుమ్మలతో సహజీవనాలు గట్రా ఎంజాయ్ చేసేస్తున్నాడు.. భార్యతో విడాకుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ సిస్టర్, శృతి హాసన్, సమంత.. ఇలా లిస్ట్ కాస్త పెద్దదే.. కొద్ది రోజులుగా అదితి రావు హైదరీతో మనోడు రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాడు..
‘మహాసముద్రం’ లో కలిసి నటించినప్పటి నుంచి ఇది మొదలైంది.. శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కి జంటగా వచ్చి.. కెమెరాల కంటపడ్డారు.. మీడియా కోడై కూస్తున్నా కానీ తమ రిలేషన్ షిప్ గురించి సిద్, అదితి రెస్పాండ్ కాలేదు.. కట్ చేస్తే.. నిప్పు లేనిదో పొగ రాదు అన్నట్టు.. తమ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నిజమే అన్నట్టు ఇద్దరూ కలిసి లేటెస్ట్ సెన్సేషన్ ‘టంగ్ టంగ్’ సాంగ్‌కి బ్యూటిఫుల్ స్టెప్స్ వేసిన వీడియో షేర్ చేసింది అదితి.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?