Kiara Advani: బాయ్ ఫ్రెండ్ తో కియారా.. రొమాంటిక్ డోస్ మాములుగా లేదు!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, బయటకి క్లోజ్ గా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే వీరి రిలేషన్ పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఎప్పటికప్పుడు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతున్నారు. అంతేకాకుండా.. కియారా చాలాసార్లు సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియోలు, ఫోటోలు గతంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. వీరిద్దరూ కలిసి నటించిన ‘షేర్షా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ కలిసి ఓ రీల్ వీడియో చేశారు. అందులో బ్యాక్ గ్రౌండ్ లో ‘షేర్షా’ సాంగ్ ప్లే అవుతుండగా.. కియారా అలా ముందుకు నడుస్తూ ఉండగా.. వెనుక నుండి సిద్ధార్థ్ వచ్చి కియారా చేయి పట్టుకొని రొమాంటిక్ గా వెనక్కి లాగుతూ కనిపించాడు. ఈ సన్నివేశంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రియల్ కపుల్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘టూ మచ్ క్యూట్ నెస్’ అంటూ హీరోయిన్ రకుల్ కూడా కామెంట్ చేసింది. ఇక ‘షేర్షా’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus