Siddu Jonnalagadda: యంగ్ హీరో పరువు తీసిన డీజే టిల్లు హీరో.. ఆ హీరో రియాక్షన్ ఇదే!

డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన సిద్ధు జొన్నలగడ్డకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగష్టు నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా థియేటర్లలో విడుదలైన అన్ని మంచి శకునములే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ను సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశారు.

అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా (Siddu Jonnalagadda) సిద్ధు జొన్నలగడ్డ సంతోష్ శోభన్ తో ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ “అసలు నువ్వు మూవీస్ ఎందుకు చేస్తున్నావ్” అని అడిగారు. మాళవిక ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో నటిస్తారని సిద్ధు జొన్నలగడ్డ పేర్కొన్నారు. సంతోష్ శోభన్ వెంటనే ఏంటి బ్రో అంత మాట అనేశావ్. నేను హీరోగా సక్సెస్ కావాలనే సినిమాలు చేస్తున్నానని సిధ్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.

మరోవైపు అన్నీ మంచి శకునములే సినిమాకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సంతోష్ శోభన్ కు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు సైతం సంతోష్ శోభన్ కు సపోర్ట్ చేస్తున్నారు.

కథ, కథనం విషయంలో సంతోష్ శోభన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంతోష్ శోభన్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అన్నీ మంచి శకునములే 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా నాన్ థియేట్రికల్ హక్కులతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని సమాచారం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus