సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) , వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya) హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘జాక్’ (Jack) సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “భాస్కర్ (Bhaskar) గారి సినిమాలు ‘బొమ్మరిల్లు’ (Bommarillu) బ్లాక్ బస్టర్, ‘పరుగు’ (Parugu) బన్నీ (Allu Arjun) అన్నతో చేసింది బ్లాక్ బస్టర్, ‘ఆరెంజ్’ (Orange) సినిమా కూడా బ్లాక్ బస్టర్.
నాది, భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న ‘జాక్’ కూడా 200 శాతం మీ అందరికీ నచ్చుతుంది. సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే.. రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కాకుండా.. వెంటనే హిట్ చేయండి ఆ సినిమాని” అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే పక్కనే ఉన్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మైక్ అందుకుని.. “అందుకే సినిమా థీమ్ ఏంటి అనేది కూడా ఇక్కడే స్టేజిపై చెప్పేశాను” అంటూ చెప్పడం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్.. ” ‘ఆరెంజ్’ సినిమా 2010 లో రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ ఆ సినిమాని చూడలేదు. అది డిజాస్టర్ అని డిక్లేర్ చేసేశారు. కానీ పదేళ్ల తర్వాత అది కల్ట్ క్లాసిక్ అన్నారు. రీ- రిలీజ్ చేస్తే.. ఎగబడి థియేటర్లకు వెళ్లి చూసి బ్లాక్ బస్టర్ చేశారు. అందుకే సిద్దు, భాస్కర్.. పై విధంగా కామెంట్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.
ఆరెంజ్ సినిమా రిజల్ట్ గురించి సిద్ధు ఫన్నీ కామెంట్#JACK #SiddhuJonnalagadda #VaishnaviChaitanya #BommarilluBhaskar pic.twitter.com/ehB00gZgC4
— Filmy Focus (@FilmyFocus) April 8, 2025