ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసే ‘క్యూ అండ్ ఎ’ లు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. రిపోర్టర్ల పేరుతో కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడం.. అవి వైరల్ అవ్వడం. జనాలు రిపోర్టర్లు అందరినీ తిట్టిపోస్తుండటం..వంటివి జరుగుతున్నాయి. అందుకోసం రిపోర్టర్ల మొహాలపై కెమెరాలు పెట్టడం మానేశారు. అయినా సరే కొంతమంది అటెన్షన్ కోసం కాంట్రోవర్సీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే.. కొంతమంది స్టార్స్ కూడా మీడియా వాళ్ళపై పంచులు వేసి హైలెట్ అవుదామని, అటెన్షన్ గ్రాబ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ లిస్టులో నాగవంశీ (Suryadevara Naga Vamsi ), విశ్వక్ సేన్ (Vishwak Sen) వంటి వారు ఉన్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే ఈరోజు ‘జాక్’ (Jack) ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్… ‘డైలాగుల్లో బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టు ఉన్నారు? జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అలాంటివన్నీ..! సెన్సార్ అయ్యిందా?’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డని ప్రశ్నించాడు. అందుకు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బదులిస్తూ.. “అవును బూతులు వాడాము.
అక్కడ ఆ డైలాగ్ చెప్పాలనిపించింది… చెప్పాము! నేను ఏమీ ప్లాన్ చేసింది కాదు. హీరో క్యారెక్టర్ కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్ కి.. పీక్ క్లైమాక్స్ లో ఒక ఫ్రస్ట్రేషన్లో నుండి వచ్చే డైలాగ్ అది. అక్కడ ఆ ఎమోషన్ కి, పాయింట్ కి.. కరెక్ట్ అని వాడాము. సినిమా సెన్సార్ అయ్యిందో లేదో నాకు తెలీదు” అంటూ అసహనం వ్యక్తం చేస్తూనే సమాధానం ఇచ్చాడు. అయినప్పటికీ సదరు రిపోర్టర్.. ‘సినిమా ఏమయ్యిందో కూడా హీరోకి తెలీదా?’ అంటూ సిద్ధుని రెచ్చగొట్టే విధంగా ప్రశ్నించాడు.
అందుకు సిద్ధు..”సినిమా ఏమయ్యిందో తెలీదు అనడం లేదు.. సెన్సార్ అయ్యిందో లేదో తెలీదు అంటున్నా” అంటూ జవాబిచ్చాడు. అయినా ఆ రిపోర్టర్ వదల్లేదు. ‘సెన్సార్ అయ్యిందో లేదో తెలుసుకోవడం మీ పనే కదా..?’ అంటూ మళ్ళీ సిద్ధుని కెలికాడు. అందుకు ‘సారీ సార్.. తెలుసుకుంటాను’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
బూతులు బాగా వాడాము
హీరోకి సెన్సార్ అయ్యిందో లేదో తెలీదా..?#Jack #SiddhuJonnalagadda #VaishnaviChaitanya #BommarilluBhaskar pic.twitter.com/WLzYmByvBn
— Filmy Focus (@FilmyFocus) April 3, 2025