టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ.. ‘డీజీ టిల్లు’తో వాంటెడ్ హీరోగా మారిపోయారు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమాలో అతడు హీరోగా నటించడమే కాకుండా రైటర్ గా కూడా పని చేశారు. సినిమాలో టిల్లు క్యారెక్టర్ ఆ రేంజ్ లో జనాలకు ఎక్కిందంటే దానికి కారణం సిద్ధూ అనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిపోయింది. ఈ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేశారు సిద్ధూ.
అలానే ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో ‘డీజే టిల్లు’ పార్ట్ 2 తీయాలనుకుంటున్నారు. దీనికోసం తాను ఒప్పుకున్నా వేరే సినిమాలను కూడా వదులుకున్నారు సిద్ధూ. ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అయితే చిత్రవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డీజే టిల్లు2’ని సిద్ధూ డైరెక్ట్ చేయాలనుకుంటున్నారట. మొదటి పార్ట్ కి సిద్ధూ కథ, మాటలు అందించారు.
స్క్రీన్ ప్లేలో భాగం పంచుకున్నారు. కాబట్టి ఈసారి కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈసారి అతడు మెగాఫోన్ కూడా పట్టేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ కి అన్నీ తానై వ్యవహరించిన నేపథ్యంలో డైరెక్షన్ చేయడం కష్టమేమీ కాదని అతను భావిస్తున్నారు. నిజానికి విమల్ కృష్ణనే దర్శకుడిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ అతడికి వేరే కమిట్మెంట్స్ ఉండడంతో అతడు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాడంటున్నారు.
అడివి శేష్ తరహాలో సిద్ధూకి కూడా రైటింగ్, సినిమా మేకింగ్ లో మంచి పట్టు ఉంది. తను నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకి స్క్రిప్ట్, మేకింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు సిద్దూ. ‘మా వింత గాథ వినుమా’ సినిమాకి కూడా అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు ఆ అనుభవంతోనే దర్శకత్వం చేయడానికి రెడీ అయిపోతున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!