‘స్టైలిష్’ ఫేక్ ఓట్లు..?
- May 31, 2016 / 09:46 AM ISTByFilmy Focus
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ ఏడాది జూన్ 30, జూలై 1 తేదీల్లో సింగపూర్ వేదికగా జరగనుండగా.. ఈ అవార్డుల నామినేషన్స్ ను ఇటీవలే ప్రకటించారు. తెలుగులో ఉత్తమ కథానాయకుడు కేటగిరీలో ప్రభాస్ (బాహుబలి ది బిగినింగ్), మహేష్ బాబు (శ్రీమంతుడు), నాని(భలే భలే మగాడివోయ్), వరుణ్ తేజ్(కంచె), అల్లు అర్జున్ (రుద్రమదేవి)లు పోటీపడుతున్నాడు. వీరిలో అత్యధికంగా మహేష్, ప్రభాస్ ల మధ్యే ప్రధాన పోరు నడిచింది.
వీరికి దాదాపు సమాన ఓట్లు పోలైయ్యాయి. అయితే అనూహ్యంగా వీరిద్దరి కంటే ఎక్కువగా అల్లు అర్జున్ కు ఓట్లు వచ్చాయి. దాంతో అనుమానం వచ్చిన సైమా.. క్రాస్ చెక్ చేయగా, 30వేల ఫేక్ ఓట్లు అల్లు అర్జున్ కు పోలైనట్లు వారు నిర్ధారణకు రావడమే కాకుండా, ఆ ఫేక్ ఓట్లను తొలగించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















