Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » సిల్లీ ఫెలోస్

సిల్లీ ఫెలోస్

  • September 7, 2018 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిల్లీ ఫెలోస్

తమిళంలో మంచి విజయం సాధించిన “వేలైను వందుట్ట వెల్లైకారన్” అనే చిత్రానికి రీమేక్ గా రూపొందిన చిత్రం “సిల్లీ ఫెలోస్”. అల్లరి నరేష్-సునీల్ ల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు ఎనిమిదేళ్ళ విరామం అనంతరం కలిసి నటించిన చిత్రమిది. ఈ కామెడీ రీమేక్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. తమిళనాట ప్రేక్షకుల్ని విశేషంగా నవ్వించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!! Silly Fellows Movie Review

కథ : సత్యనారాయణపురం అనే గ్రామంలో టైలర్ గా పనిచేసే వీరబాబు (అల్లరి నరేష్), అదే ఊర్లో జులాయిగా తిరిగే సూరిబాబు (సునీల్) మంచి స్నేహితులు. తమ ఏరియా ఎమ్మెల్యే జాకెట్టు (జయప్రకాష్ రెడ్డి)కి చేయదలుచుకున్న సామూహిక వివాహ కార్యక్రమంలో ఉండాల్సిన 25 మంది జంటల్లో 7 అబ్బాయిలు, 1 అమ్మాయి పారిపోవడంతో ఆఖరి నిమిషంలో ఆ జంటల్లో సూరిబాబును కూడా చేర్చి అతడికి రికార్డింగ్ డ్యాన్సర్ పుష్ప (నందిని రాయ్)తో పెళ్లి చేస్తాడు. కానీ.. అప్పుడే కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్ళికి సిద్ధమైన సూరిబాబుకి పుష్పతో పెళ్లి పబ్లిక్ అయిపోవడంతో కొత్త సమస్యలు వచ్చిపడతాయి.

వీరబాబు కూడా అదే ఊర్లో టిఫిన్ సెంటర్ ఓనర్ కూతురైన వాసంతి (చిత్ర శుక్ల)ను ప్రేమిస్తాడు. ఆమెను పోలీస్ చేస్తానంటూ ఆమె తల్లిని నమ్మబలికి ఆమె నుంచి 10 లక్షలు తీసుకొని ఎమ్మేల్యేకి ఇస్తాడు. అయితే.. అటు సూరిబాబు, ఇటు వీరబాబుల జీవితాలకు సుఖాంతం పలకాల్సిన ఎమ్మెల్యే ఒక యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఎమ్మెల్యేకి మళ్ళీ గతం గుర్తుకొచ్చిందా? సూరిబాబు పొరపాటున పెళ్లాడిన పుష్పకు విడాకులిచ్చి తాను ఇష్టపడిన కృష్ణవేణికి తాళి కట్టాడా? వీరబాబు-వాసంతిల ప్రేమ ఫలించిందా? వంటి ప్రశ్నలకు సరదాగా చెప్పిన సమాధానాల సమాహారం “సిల్లీ ఫెలోస్” చిత్రం. Silly Fellows Movie Review

నటీనటుల పనితీరు : అల్లరి నరేష్ తన పాత్రలో ఎప్పట్లానే చలాకీగా నటించేశాడు. అయితే.. ఇంతకుముందు అతడిలో కనబడిన కామెడీ టైమింగ్ ఇప్పుడు మిస్ అయ్యింది. అదే తరహా పాత్రలు వరుసబెట్టి చేయడం వల్లనో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ.. పెద్దగా కష్టపడకుండా అయిపోయింది అనిపించాడు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ చాలాకాలం తర్వాత సునీల్ కమెడియన్ గా కనిపించాడు. మరీ తన మునుపటి సినిమాల స్థాయిలో యాక్టివ్ గా యాక్ట్ చేయకపోయినప్పటికీ.. పాత సునీల్ ను మళ్ళీ చూశామన్న ఆనందాన్ని మాత్రం ప్రేక్షకులకి మిగిల్చాడు. చిత్ర శుక్ల అందంగా కనిపించింది కానీ.. అభినయంతో అలరించలేకపోయింది. తెలుగమ్మాయి నందిని రాయ్ తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోకుండా ఉంటే బాగుండేది. తమిళం ఒరిజినల్లో భీభత్సమైన కామెడీని పంచే పుష్ప పాత్రలో ఆమె మెప్పించలేకపోయింది. జయప్రకాష్ రెడ్డి పాత్ర ఓ మోస్తరుగా అలరించింది. పోసాని కూడా నవ్వించడానికి కాస్త గట్టిగానే కష్టపడ్డాడు. Silly Fellows Movie Review

సాంకేతికవర్గం పనితీరు : శ్రీవసంత్ సంగీతం, అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే.. దర్శకుడు క్లైమాక్స్ మినహా ఎక్కడా చిన్న మార్పు కూడా చేయకుండా తమిళ వెర్షన్ ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయడం మైనస్ గా మారింది. నరేష్-సునీల్ లాంటి కామెడీ జనరేటర్స్ ను పెట్టుకొని సాదాసీదా కథనంతో సినిమాని నడిపించడం బాధాకరం. అయినా.. ఆల్రెడీ తెలుగులో విడుదలై హైద్రాబాద్ లోనే ఒక రెండు వారాలు ఆడిన “ప్రేమ లీల పెళ్లి గోల” చిత్రాన్ని మళ్ళీ కష్టపడి తెలుగులో రీమేక్ చేయాల్సిన అవసరం ఏమోచ్చింది? కథలు దొరకడం లేదా లేక అర్జెంట్ గా నరేష్-సునీల్ కాంబినేషన్ లో సినిమా చేయకపోతే ఆడియన్స్ కొడతామని ఏమైనా బెదిరించారా?.

ఏదేమైనా రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు మరోమారు తడబడ్డారు. కథ-కథనం అనేది ఎలాగూ ఆకట్టుకోదు కాబట్టి ఉన్న ఆ కొన్ని కామెడీ సీన్లు కూడా కేవలం కొందర్ని మాత్రమే అలరిస్తాయి కాబట్టి “సిల్లీ ఫెలోస్” ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. Silly Fellows Movie Review

విశ్లేషణ : సిల్లీ కథ, సిల్లీ పెర్ఫార్మెన్సెస్, సిల్లీ కామెడీతో రూపొందిన ఈ “సిల్లీ ఫెలోస్”ను సిల్లీగా ఒకసారి చూడాలి తప్పితే.. సీరియస్ నవ్విస్తుందని ఆశించి థియేటర్ కి వెళ్తే మాత్రం నీరసపడడం ఖాయం.Silly Fellows Movie Review

రేటింగ్ : 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Bhimaneni Srinivasa Rao
  • #Chitra Shukla
  • #Movie Reviews
  • #Nandini Rai

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

trending news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

5 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

5 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

6 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

17 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

18 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

1 day ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version