చరణ్, తారక్ మధ్య పోలికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహ బంధం ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా 2022 సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. అయితే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా చరణ్, తారక్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలుగా ఈ ఇద్దరు హీరోలకు పేరుండగా ఈ ఇద్దరు హీరోల భార్యలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఈ ఇద్దరు స్టార్ హీరోలకు కార్లంటే ఎంతో ఇష్టం కాగా మార్కెట్ లోకి ఏదైనా కొత్త కారు వస్తే కొనుగోలు చేయడానికి ఈ ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉంటారు. నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో ఈ ఇద్దరు హీరోలు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల ఆస్తుల విలువ వేర్వేరుగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. చరణ్ కు సొంతంగా ఎయిర్ లైన్స్ కంపెనీ ఉండగా తారక్ కు కూడా సొంతంగా ప్రైవేట్ జెట్ ఉందని సమాచారం.

హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఇద్దరు హీరోలకు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరోలలో ఈ ఇద్దరు హీరోలు ముందువరసలో ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉన్నా ఈ ఇద్దరు హీరోలు ఎంతో కష్టపడి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు జక్కన్నతో మంచి అనుబంధం ఉంది.

సినిమాల కోసం లుక్ ను మార్చుకోవడానికి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి ఈ హీరోలు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు. చరణ్, తారక్ మరిన్ని సినిమాలలో కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus