Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

ప్రయోగాత్మక సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా అలాంటి అటెంప్ట్..లు చేస్తున్నప్పుడు నిర్మాతని దృష్టిలో పెట్టుకుని దర్శకులు వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నిర్మాతలు కూడా స్క్రిప్ట్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఇద్దరూ కలిసి సక్రమంగా నడుచుకుంటే.. ప్రయోగాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.

Ghaati

టాలీవుడ్లో కొంతమంది దర్శకులు ఉన్నారు. వాళ్ళు కమర్షియాలిటీకి దూరంగా తాము చెప్పాలనుకున్న కథ క్లుప్తంగా చెప్పాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో శేఖర్ కమ్ముల, క్రిష్ జాగర్లమూడి, చంద్రశేఖర్ యేలేటి వంటి వాళ్ళు కచ్చితంగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ముగ్గురు కూడా తమ పంధాలో సినిమాలు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. శేఖర్ కమ్ముల అయితే ఇప్పటికీ తన పంధా మార్చుకుంది అంటూ ఏమీ లేదు. ‘కుబేర’ వంటి పెద్ద సినిమా చేసినా.. తన సెన్సిబిలిటీస్ ఎంత మాత్రం మిస్ చేయలేదు.

అయితే చంద్రశేఖర్ యేలేటి, క్రిష్ జాగర్లమూడి మాత్రం తమ పంధా మార్చుకుని తప్పు చేశారనే చెప్పాలి. ఉదాహరణకి 2021 లో ‘చెక్’ అనే సినిమా చేశారు చంద్రశేఖర్ యేలేటి. ఇందులో నితిన్ హీరో.. ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి..’తాను తీసిన సినిమాలకు ప్రశంసలు దక్కాయి కానీ డబ్బులు రాలేదు. అందువల్ల ఆ సినిమా నిర్మాతల మొహాల్లో ఆనందం చూడలేకపోయాను.. ఆ లోటుని తీర్చుకునేందుకు ‘చెక్’ సినిమా చేశాను. ఇది కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకుంటుంది’ అని ఆశపడుతున్నట్లు తెలిపారు.ఆ స్టేట్మెంట్ నచ్చకో ఏమో ఆడియన్స్ ఆ సినిమాని పట్టించుకోలేదు. పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘ఘాటి’ ప్రమోషన్స్ లో క్రిష్ కూడా ఇలాగే చెప్పుకొచ్చారు. ‘తన గత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, ఇప్పుడు తనకు ఓ కమర్షియల్ సక్సెస్ అవసరం’ అంటూ చెప్పుకొచ్చారు క్రిష్. కట్ చేస్తే ఈ సినిమా కూడా ఫలితం కూడా ‘చెక్’ మాదిరే అయ్యింది. సో దర్శకులు తమ పంధా మార్చుకోవడం కూడా తప్పేనేమో.

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus