ప్రముఖ సింగర్‌కి గతేడాది వివాహం అయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న తర్వాత వెంపటి పృథ్వీనాథ్‌ను ఆమె గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడామె వైవాహిక బంధం బీటలు వారిందా? ఏమో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే అదే అనిపిస్తోంది. అంతేకాదు పృథ్వీనాథ్ ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. అందులో ఇద్దరూ కలిసున్న ఫొటోలు లేవు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఫొటోలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితి సెలబ్రిటీల విషయంలో విడాకులు ముందే చూస్తుంటాం. అందుకే డౌట్ వస్తోంది.
చిన్న వయసులోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్న యువ గాయని హారికా నారాయణ్ (Harika Narayan). సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం ఆమె వాయిస్‌లో ఉన్న ప్రత్యేకతే. ఆ విషయం పక్కన పెడితే.. గత ఏడాది మార్చి 17న హారికా నారయణ్ పెళ్లి చేసుకున్నారు. మార్చి 6న నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను ఆమె అప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటివరకు వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దగా ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో దగ్గరివారికి మాత్రమే తెలుసు.
దానికి కారణం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను హారికా నారాయణ్ గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు ఫొటోలు కూడా అంతే చడీచప్పుడు లేకుండా తీసేశారు. అయితే ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఇదొక్కటే అనుకూలమైన విషయం. దీంతో ఫొటోల విషయంలో ఎవరో ఒకరు స్పష్టత ఇస్తే గాని అసలు విషయం తెలియదు. ఇలాంటి పుకార్లకు చెక్ పడదు. మరి ఆమె అయినా ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.
ప్రస్తుతం హారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేవలం ఆమె సినిమాలకు సంబంధించిన పోస్టులు, స్టేజీ షోలకు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. హారిక సింగర్‌గానే కాకుండా ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించింది కూడా. ఇక ఆమె దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మునిమనవరాలు అనే విషయం తెలిసిందే.