ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే) మరణవార్త సినీ, సంగీత ప్రేమికులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వందల పాటలను శ్రోతలకు వినిపించిన కేకే గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హిందీ తెలుగు కన్నడ తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ విశేషమైన గుర్తింపు పొందారు. మంగళవారం సాయంత్రం కేకే ఒక వేడుకలో పాటలు పాడుతూ అందరిని సందడి చేశారు.
ఈ వేడుక ముగిసిన అనంతరం ఆయన హోటల్ కి వెళ్లగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త విన్న ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇకపోతే సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఆ పాట ఎంతటి కష్టమైనా కూడా ఎంతో సునాయాసంగా పాడేవారు. పాటే ప్రాణంగా బతికిన కేకే ఒక్కో పాటకు సుమారు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు.
ఇక చిన్న సినిమాలు అయితే ఈయన తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వారని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇక ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ అయినప్పటికీ తన పాటల విషయంలో కూడా తాను కొన్ని లిమిట్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఇస్తామన్నా కానీ ధనవంతులు,
గొప్ప వాళ్ళు ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలలో మాత్రం పాటలు పాడటానికి ఏ మాత్రం ఒప్పుకునే వారు కాదని, తాను అలా పాటలు పాడనని ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విధంగా పాటను ప్రేమించే కేకే చివరి వరకు పాటలు పాడుతూ తుదిశ్వాస విడచడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.