లివింగ్ లెజెండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు 40రోజులుగా ఆస్పత్రి బెడ్ కే పరిమితం అయ్యారు.గత నెల 5వ తేదీన బాలసుబ్రమణ్యం కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు. మైల్డ్ సింటమ్స్ ఏమి కాదు, కోలుకొని తిరిగి వచ్చేస్తాను అని బాలు ఆసుపత్రిలో చేరబోయే ముందు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఐతే ఆసుపత్రిలో చేరిన వారం రోజులకు ఆయన ఆరోగ్యం విషమించింది. దీనితో డాక్టర్స్ సాధారణ గది నుండి ఐసీయూ కి తరలించారు.
ఒక దశలో బాలు ఆరోగ్యం మరింత విషమ స్థితికి చేరుకుంది. ఆయనకు వైద్యం అందించడం కోసం విదేశీ వైద్యులు కూడా రావడం జరిగింది. అభిమానుల ఆశీస్సులు కావచ్చు, దేవుని దయ కావచ్చు బాలు చిన్నగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యంపై తరచుగా అప్డేట్స్ ఇస్తున్న ఎస్పీ చరణ్ నేడు కూడా ఓ వీడియో సందేశంలో ప్రస్తుత పరిస్థితి వివరించారు. బాలు గారి ఊపిరి తిత్తులలో ఇంప్రూవ్మెంట్ కనిపించినట్లు ఆయన చెప్పారు. డాక్టర్స్ ఫిజియోథెరఫీ అందిస్తున్నారని, అందుకు ఆయన సహకరిస్తున్నట్లు చెప్పారు.
అలాగే బెడ్ పై బాలుగారు నేడు కూర్చున్నారట. డాక్టర్స్ ఆయనను ఓ 15 నిముషాలు కుర్చోపెట్టారట. ఇప్పటివరకు బాలుగారికి సెలైన్స్ ద్వారా ఆహారం అందిస్తూ ఉండగా, నోటి ద్వారా ఆహారం ఇవ్వాలని డాక్టర్స్ భావిస్తున్నట్లు చరణ్ చెప్పుకొవచ్చారు. చరణ్ తాజా వీడియో సందేశం ద్వారా, బాలు ఆరోగ్యం కుదుటపడినట్లు, త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రానున్నారని అర్థం అవుతుంది.
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!