సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో సంస్థ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. గౌడ కులానికి చెందిన మహిళలను కించపరిచేలా వీడియోలను ప్రసారం చేయడంతో ఆ కులానికి చెందిన వారు ఫైర్ అయ్యారు. ఆ వీడియోలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా ఈ విషయంపై రామ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆయన ఏం రాసుకొచ్చారంటే.. ”మ్యాంగ్ 20 సంవత్సరాలకు పైగా ఎలక్ట్రానిక్ డిజిటల్ కంటెంట్ పబ్లిషింగ్ బిజినెస్‌లో ఉన్న కంపెనీ.
మేం ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ కంపెనీ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. సోమవారం 24 జనవరి 2022 నాడు కొంత మంది వ్యక్తులు తాము గౌడ్ కమ్యూనిటీకి చెందిన వాళ్లమని, ఒక సినిమా, వీడియో క్లిప్ గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గౌడ మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారని వాదిస్తూ, పేర్కొన్న కంటెంట్ యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు.పేర్కొన్న ఫిల్మ్ అప్పటికే సెన్సార్ చేయబడి, సెన్సార్ సర్టిఫికేట్‌తో పాటు యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్త్రీలను కించపరుస్తూ చూపే ఎటువంటి సన్నివేశాలను చూపటం ఎన్నడూ మా ఉద్దేశం కాకపోవడం, మా సిద్దాంతాలకు వ్యతిరేకం కావడం వల్ల మేం వెంటనే 24.01.2022న వీడియోను తొలిగించాం.
మహిళలందరి పట్ల మాకు అత్యంత గౌరవం ఉందని తెలియజేస్తూ మేం ఇప్పటికే తీసేసిన సబ్జెక్ట్ వీడియో వల్ల పొరబాటున ఎవరైనా మహిళ లేద గౌడ కమ్యూనిటీకి చెందిన ఏ వ్యక్తి యొక్క మనోభావాలనైనా ఒకవేళ పొరబాటు నొప్పించి ఉంటే మేం భేషరుతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము. అటువంటి ఉద్దేశ్యమేదీ మాకు లేదని స్ఫష్టం చేస్తున్నాం. ఇప్పటికీ మేము సోషల్ మీడియాలో గౌడ్ కమ్యూనిటీకి చెందిన నెటిజన్ల నుండి ఆవేదన వ్యక్తం చేస్తూ మెసేజ్, పోస్ట్ లను అందుకుంటున్నందున వారిలో ప్రతి ఒక్కరికీ.. ఒకవేళ మేము అనుకోకుండా బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాము” అంటూ తెలిపారు.