సంగీత దర్శకుడు, స్వరవాణి. ఎమ్.ఎమ్. కీరవాణి.. ఆయన సోదరుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకూ అద్భుతమైన సాంగ్స్, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తుంటారు.. జక్కన్న తన చిత్రాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ అన్నయ్య కీరవాణిదే అని చెప్తుంటారు కూడా.. తమ్ముడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. అన్నయ్య తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించారు..
ఇదిలా ఉంటే.. రాజమౌళి సినిమాలకు.. ఆయన భార్య రమా, తనయుడు కార్తికేయ, కీరవాణి భార్య శ్రీవల్లి, కొడుకు కాల భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్, మరో తమ్ముడు కాంచీ తదితరులు వర్క్ చేస్తుంటారు.. కుటుంబంలో తలో ఒకరు తమ పనితనంతో సినిమా విజయంలో తమవంతు సాయమందిస్తుంటారు.. అయితే కీరవాణి, రాజమౌళిల సోదరి.. ఒకప్పుడు తన సంగీతంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎమ్.ఎమ్. శ్రీలేఖను పట్టించుకోవడం లేదు.. ఎందుకు దూరం పెట్టారు? అంటూ కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి..
శ్రీలేఖ కూడా ఎప్పుడైనా ఏదో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు అన్నయ్యలతో తీసుకున్న పిక్స్ పోస్ట్ చేయడమే కానీ పెద్దగా కలిసినట్లు కనిపించలేదు అని కూడా కొందరు అన్నారు.. కట్ చేస్తే.. ఆ అనుమానాలన్నిటికీ ఒకే ఒక్క ఫోటోలతో సమాధానం చెప్పిందామె.. 1992 లో విజయ్ నటించిన ‘నాలైయ తీర్పు’ అనే సినిమాతో, మణిమేకలై పేరుతో సంగీత దర్శకురాలిగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 1996లో ‘ఆయనకిద్దరు’ తో ప్లేబ్యాక్ సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయింది..
‘తాజ్ మహల్’, ‘ధర్మచక్రం’, ‘శివయ్య’, ‘ప్రేయసి రావే’, ‘ప్రేమించు’, ‘అమ్మాయి బాగుంది’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘ఆపరేషన్ ధర్యోధన’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిందామె.. ఇటీవల అడివి శేష్ ‘హిట్ : ది సెకండ్ కేస్’ కి పాటలు కంపోజ్ చేసింది.. సినీ రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. మ్యూజిక్ వరల్డ్ టూర్ చేపడుతుంది.. ఈ టూర్ పోస్టర్‌ను జక్కన్న రిలీజ్ చేశారు.. ఆయనకు థ్యాంక్స్ తెలుపుతూ ఫోటో షేర్ చేసింది శ్రీలేఖ.. దీంతో కొందరు వ్యక్తం చేస్తున్న సందేహాలకు సమాధానం దొరికేసింది..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?