కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బైలింగ్యువల్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట అలాగే టీజర్, ట్రైలర్ లు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.
ఇక ఫిబ్రవరి 17న విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి.రెండో రోజు కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం..10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
6.14 cr
సీడెడ్
2.07 cr
ఉత్తరాంధ్ర
2.10 cr
ఈస్ట్
1.38 cr
వెస్ట్
0.61 cr
గుంటూరు
1.12 cr
కృష్ణా
0.97 cr
నెల్లూరు
0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.72 cr
తమిళనాడు
15.90 cr
ఓవర్సీస్
10.49 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
46.04 cr (షేర్)
‘సార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.14.93 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.9.43 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీకి రూ.33.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
అలా చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.10 రోజులు పూర్తయ్యేసరికి రూ.46.04 కోట్ల షేర్ ను రాబట్టింది. సో ఓవరాల్ గా 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ రూ.12.04 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. తమిళ్ లో ఈ మూవీకి రూ.18.2 కోట్ల బిజినెస్ జరిగితే.. అక్కడ మాత్రం 10 రోజుల్లో కేవలం రూ.15.90 కోట్ల షేర్ నే రాబట్టడం గమనార్హం.