Siri, Maanas: టాప్ – 5 లో నుంచీ ముందుగా ఎలిమినేట్ అయ్యింది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో టాప్ – 5 ఎలిమినేషన్ అనేది అత్యంత నాటకీయంగా జరుగుతోంది. సీజన్ 4లో ఎంతో ఉత్కంఠతో జరిగిన ఎలిమినేషన్ కంటే కూడా చాలా గ్రాండ్ గా ఈ ఎలిమినేషన్ ని ప్లాన్ చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో భాగంగా ముందుగా టాప్ – 5 కంటెస్టెంట్స్ లో నుంచీ సిరిని ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా సిరి ఎక్కడా కూడా టైటిల్ రేస్ లో లేదు. టాప్ – 5లో అన్నిచోట్లా ఆఖరి స్థానంలోనే కొనసాగుతోంది. అందరూ ఊహించినట్లుగానే ముందుగా బిగ్ బాస్ హౌస్ నుంచీ సిరి ఎలిమినేట్ అయిపోయింది.

ఇక సిరి ఎలిమినేట్ అయిన తర్వాత సిరి షణ్ముక్ గెలుపుకోసమే వెయిట్ చేస్తూ స్టేజ్ పైకి వచ్చి ఎక్స్ పార్టిసిపెంట్స్ తో జాయిన్ అయ్యింది. ఇక్కడే విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. సిరి ఎలిమినేట్ అయిన తర్వాత మానస్ ని కూడా కింగ్ నాగార్జున తనదైన స్టైల్లో ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం. మానస్, కాజల్, సన్నీలు ముగ్గురూ కూడా మంచి ఫ్రెండ్స్ గా బిగ్ బాస్ హౌస్ లో పేరు తెచ్చుకున్నారు. మానస్ ఎలిమినేషన్ అనేది తన ఫ్రెండ్ అయిన సన్నీని షాక్ కి గురి చేసింది.

ఇక హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయిన ప్రతిసారి లెక్కలు వేసుకునే షణ్ముక్ కి కూడా ఈ ఎలిమినేషన్ అనేది ఊహకి అందనట్లుగా అయ్యింది. ఇక టాప్ 3 లో శ్రీరామ్, సన్నీ , షణ్ముక్ ముగ్గురు మాత్రమే మిగిలారు. వీళ్లలోనే బిగ్ బాస్ విజేతని నిర్ణయించబోతున్నారు. మరి వీరిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది తెలియాలంటే మనం గ్రాండ్ ఫినాలే వరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus