సిరి హన్మంత్ కిరాక్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

సోషల్ మీడియాలో సిరి హన్మంత్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే బాగా స్ప్రెడ్ అవుతుంటుంది.. యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, సీరియల్స్, వెబ్ సిరీసుల్లో నటించిన సిరి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆకట్టుకునే రూపం, అలరించే క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తనకొచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌కి కూడా వెళ్లింది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెట్ చేసి, తన స్టైల్లో గేమ్ ఆడి.. ఆ క్రేజ్ మరింత పెంచుకుంది.

నెట్టింట సిరి చేసే సందడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్, డ్యాన్స్ అండ్ ఫిట్‌నెస్ వీడియోలతో ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.. తను షేర్ చేసే పిక్స్, వీడియోలకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అర్థం చేసుకోండి మరి.. 814K మంది ఫాలోవర్లతో ఇన్‌స్టాలో రచ్చ చేస్తుంది. రీసెంట్‌గా సిరి.. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో పార్టిసిపెట్ చేసింది. ప్రోమోలో సాలిడ్ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేసింది.

శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో సిరితో పాటు నోయెల్, ఆర్జే కాజల్, సన్నీ, మానస్, అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, ముక్కు అవినాష్ (జబర్దస్త్) లాంటి స్మాల్ స్క్రీన్ సెలబ్స్ కూడా వచ్చారు.. ఓ టాస్క్‌లో భాగంగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘అత్తారింటికి దారేది’ లోని పాపులర్ ‘బాపు గారి బొమ్మో’ సాంగ్‌కి స్టెప్పులేసింది సిరి.. ఈ క్లాస్ మెలోడీ సాంగ్‌కి మొదట కొన్ని కూల్ అండ్ క్లాస్ స్టెప్పులేసిన సిరి..

తర్వాత తన టాలెంట్ బయటపెట్టి షాకిచ్చింది.. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు. ‘సిరి ఇలాంటి ఊరమాస్ స్టెప్పులేస్తుందని అస్సలు గెస్ చెయ్యలేదు.. మైండ్ బ్లోయింగ్’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిరి కిరాక్ మాస్ మూమెంట్స్ వేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus