Siri, Shrihan: కేవలం శ్రీహాన్ కి మాత్రమే అర్ధమయ్యేలా చెప్పిందా..? సిరి హౌస్ లో ఏం చేసిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ లవర్ సిరి సందడి చెేసింది. ఫ్యామీలీ ఎపిసోడ్ లో భాగంగా శ్రీహాన్ కోసం సిరి తన కొడుకు చైత్రతో కలిసి వచ్చింది. మొదట తను ఒక్కతే వచ్చి శ్రీహాన్ ని హగ్ చేస్కుని మరీ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత శ్రీహాన్ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావంటూ మాట్లాడింది. హౌస్ మేట్స్ ని పలకరిస్తూ శ్రీహాన్ కి హింట్ ఇఛ్చింది. లేడీ టైగర్ అంటూ ఇనాయని రెండు మూడుసార్లు పిలిచింది.

అంతేకాదు, ఏంటి ఈమద్య మావోడి మీద కాన్సట్రేషన్ తగ్గించావ్ అంటూ చెప్పింది. అలాగే, కీర్తితో బాగుండు మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుందని చెప్పింది. శ్రీసత్యని రోజు పొగుడుతున్నావ్ కదా అంటూ కామెడీ చేసింది. ఇలా హౌస్ మేట్స్ తో మాట్లాడిన తర్వాత శ్రీహాన్ ని కళ్లు మూసుకోమని సర్ ప్రైజ్ ఇచ్చింది. తన మెడ వెనక వేసుకున్న ట్యాటూని చూపించింది. తను, శ్రీహాన్, చైతూ ముగ్గురు పేర్లు కలిసొచ్చేలా ఉన్న ఈ ట్యాటూ చూసి శ్రీహాన్ షాక్ అయ్యాడు.

ఇప్పుడు ఈ ట్యూటూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి సిరి సీజన్ 5లో టాప్ 5కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచింది. అప్పుడు షణ్ముక్ తో కలిసి గేమ్ ఆడటం, తనతో క్లోజ్ గా ఉండటం వల్ల చాలామందికి యాంటీ అయ్యింది. అంతేకాదు, షణ్ముక్ టైటిల్ గెలవకపోవడానికి కూడా కారణం సిరినే అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అంతేకాదు, తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహాన్ తో బ్రేకప్ చెప్పేసిందనే వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత టెలివిజన్ లో ప్రసారమైన సీజన్ లోకి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వచ్చాడు. ఇప్పుడు శ్రీహాన్ కోసం సిరి రావడం, ఈ ట్యాటూని చూపించడంతో అందరి మనసులో ఉన్న అనుమానాలు తీరిపోయాయి. ఇక శ్రీహాన్ – సిరిల కొడుకు అయిన చైతూ హౌస్ లో సందడి చేశాడు. యాక్టివ్ గా తిరుగుతూ హౌస్ మేట్స్ డైలాగ్స్ ని చెప్పాడు. అంతేకాదు, రేవంత్ ని, శ్రీహాన్ ని ఇమిటేట్ చేస్తూ రెచ్చిపోయాడు.

గీతు డైలాగ్స్ ని కూడా హౌస్ లో రిపీట్ చేస్తూ మాట్లాడే సరికి హౌస్ మేట్స్ అందరూ ఖంగుతిన్నారు. ఇక సిరి శ్రీహాన్ ల రిలేషన్స్ పై ఉన్న అనుమానాలు అన్నీ ఈ ఎపిసోడ్ లో తీరిపోయాయనే చెప్పాలి. మరోవైపు ఫ్యామిలీ ఎపిసోడ్ వీక్ లో భాగంగా సీజన్ 5 టైటిల్ విన్నర్ అయిన సన్నీ స్టేజ్ పైకి రాబోతున్నారు. తన ఫ్రెండ్ అయిన రాజ్ కోసం సన్నీ వస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus