దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది కానీ ఆశించినంత కాదు. కానీ రెండో రోజు నుండి ఈ మూవీ బీభత్సం సృష్టించింది.నిన్న 6వ రోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 4.03 cr |
సీడెడ్ | 1.13 cr |
ఉత్తరాంధ్ర | 1.56 cr |
ఈస్ట్ | 0.94 cr |
వెస్ట్ | 0.65 cr |
గుంటూరు | 0.80 cr |
కృష్ణా | 0.94 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.07 cr |
ఓవర్సీస్ | 3.85 cr |
మిగిలిన వెర్షన్లు | 2.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.13 cr |
‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.18.13 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ.1.13 కోట్ల లాభాలను అందించింది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంకా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. రేపు ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి క్రేజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఇంపాక్ట్ ఈ మూవీ పై పడే అవకాశం ఉంది. ఆ చిత్రం పోటీని తట్టుకుని ఈ వీకెండ్ నిలబడితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్స్ కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?