దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.
మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది.కానీ మొదటి రోజు ఆశించినంత స్థాయిలో ఈ మూవీ కలెక్ట్ చేయలేదు. అలా అని కలెక్ట్ చేసింది తక్కువ కూడా కాదు. అయితే రెండో రోజు మొదటి రోజును మించి, మూడో రోజు రెండో రోజును మించి ఈ మూవీ కలెక్ట్ చేయడం విశేషం. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.52 cr |
సీడెడ్ | 0.63 cr |
ఉత్తరాంధ్ర | 0.87 cr |
ఈస్ట్ | 0.55 cr |
వెస్ట్ | 0.42 cr |
గుంటూరు | 0.54 cr |
కృష్ణా | 0.52 cr |
నెల్లూరు | 0.23 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.62 cr |
ఓవర్సీస్ | 2.80 cr |
మిగిలిన వెర్షన్లు | 1.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.30 cr |
‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 5.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
నిన్న ఆదివారం రోజు కూడా ఈ మూవీ అద్భుతంగా కలెక్ట్ చేసింది.అయితే వీక్ డేస్ లో కూడా బాగా రాణిస్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఈరోజు మొదటి సోమవారం ఈ మూవీ కి అసలు పరీక్ష అని చెప్పాలి.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?