Sita Ramam Teaser: ఆకట్టుకుంటున్న ‘సీతా రామం’ టీజర్..!

‘ఓకే బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మమ్ముట్టి కొడుకు… దుల్కర్ సల్మాన్. అతను తెలుగులో చేస్తున్న మరో స్ట్రైట్ మూవీ ‘సీతా రామం’.యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది దీని ఉపశీర్షిక.’వైజయంతీ మూవీస్’ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన బజ్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం.

మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలకమైన పాత్ర పోషిస్తుంది.సుమంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర బృందం. 1965 కశ్మీర్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో టీజర్ ప్రారంభమైంది. ‘లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు.

తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అంటూ రామ్(దుల్కర్) కు ఓ సీతామహాలక్ష్మీ అనే అమ్మాయి రొమాంటిక్ గా ఉత్తరం రాయడం.. ఆ సీతామహాలక్ష్మీ ఎవరు అనే కన్ఫ్యూజన్ లో రామ్(దుల్కర్) ఉండడం.. ఆ తర్వాత వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ మంచి ఫీల్ ఇచ్చింది.

1 నిమిషం 14 సెకండ్ల పాటు నిడివి కలిగిన ఈ టీజర్ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. టీజర్ బాగుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి కలిగించే విధంగా ఉంది ఈ టీజర్ మీరు కూడా ఓ లుక్కేయండి :

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!


‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus