Sitara: పెట్ డాగ్ ఫ్లూటో మరణించడంతో ఎమోషనల్ అయినా సితార!

సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతో ఇష్టంగా జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు వాటిని కూడా వారి కుటుంబ సభ్యులు గానే భావిస్తూ ఉంటారు. అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి పెట్స్ కనిపించకపోతే ఎంతో బాధపడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పెట్స్ మరణించడంతో తమ కుటుంబ సభ్యులు మనకు దూరమైనట్టు భావిస్తూ ఉంటాము ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇలాంటి బాధను సితార అనుభవిస్తున్నారు. మహేష్ బాబు కూతురుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చిన్న వయసులోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి సితార తాజాగా తన పెట్ ఫ్లూటో గురించి ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

సితార (Sitara) ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి ఫ్లూటో మరణించడంతో ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ పెట్ డాగ్ ఫోటోని సితార సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఏడేళ్ల బంధం.. మిస్ యూ అంటూ కుక్కతో తనకున్న బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. సితార ఇలా ఎమోషనల్ కావడంతో నమ్రత తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతో ఉంటుంది.. మన ప్రేయర్స్‌లో ప్లూటో ఎప్పుడూ ఉంటుందని సితార పోస్టుకు నమ్రత కామెంట్ చేస్తూ తన కుమార్తెను ఓదార్చారు.

ఇక నమ్రత కూడా ఫ్లూటో మరణించడంతో ఆమె కూడా ఈ విషయం పట్ల స్పందిస్తూ నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం.. నువ్ మా గుండెల్లో మా ప్రార్థనల్లో ఎప్పటికీ ఉంటావ్ అని నమ్రత సైతం స్పెషల్‌గా పోస్ట్ వేసింది. ఇలా మరణించడంతో సితార ఏకధాటిగా కన్నీటి పర్యంతరం అవడంతో తన తల్లి తనని (Sitara) ఓదార్చే ప్రయత్నం చేశారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus