Sitara, Samantha: సమంత సెట్ లో అలా ఉంటారన్న మహేష్ కూతురు!

మహేష్ బాబు గారాలపట్టి సితార సర్కారు వారి పాట మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. సితార సర్కారు వారి పాటలో కొన్ని క్షణాల పాటు కనిపించనున్నారని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే సినిమాలో మాత్రం సితార కనిపించని సమాచారం. మహేష్ బాబు ప్రమోషన్లలో ఈ విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇవ్వడం గమనార్హం. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మహేష్ బాబు, సితార ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

రష్మిక, సమంతల గురించి మాట్లాడుతూ సామ్ ఆంటీ తనకు మంచి స్నేహితురాలు అని సితార చెప్పుకొచ్చారు. సెట్ కు ఎప్పుడు వచ్చినా సామ్ ఆంటీ తనతోనే ఉంటారని సితార అన్నారు. సమంత తనతో ఎక్కువగా ఆడుకుంటారని సితార కామెంట్లు చేయడం గమనార్హం. రష్మిక చాలా క్యూట్ గా ఉంటారని ఎంతో ఎనర్జీతో ఉంటారని సితార చెప్పుకొచ్చారు. మరోవైపు సర్కారు వారి పాట అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలోనే ఉన్నాయి. సర్కారు వారి పాట అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులను క్రియేట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

సర్కారు వారి పాట ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సమ్మర్ సెలవులు ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ కానున్నాయని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు ఈ సినిమా రిజల్ట్ విషయంలో కూడా కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పరశురామ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని చెప్పవచ్చు. పరశురామ్ తర్వాత సినిమా నాగచైతన్య హీరోగా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్టైతే పరశురామ్ కు స్టార్ హీరోలు కూడా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus