Siva Rajkumar, NTR: వైరల్ అవుతున్న శివరాజ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయనే సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ హాజరు కావడం జరిగింది. ఈ ఈవెంట్ కు హాజరైన శివరాజ్ కుమార్ సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి, బాలయ్యతో చేయబోయే సినిమా గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానం అందడంతో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

బాల్యంలో మేము చెన్నైలో పెరిగామని ప్రతిరోజూ స్కూల్ కు సీనియర్ ఎన్టీఆర్ ఇంటి మీద నుంచి వెళ్లేవాళ్లమని సీనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర ప్రతిరోజూ జనం ఉండేవారని శివరాజ్ కుమార్ అన్నారు. ఆ జనాలను దాటుకుని వెళ్లడానికి 5 నిమిషాల సమయం పట్టేదని ఆయన తెలిపారు. ఆ జనాలను చూడటం మాకు రొటీన్ అయిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ వేడుకలు జరిగితే సీనియర్ ఎన్టీఆర్ అతిథులను స్వయంగా రిసీవ్ చేసుకున్నారని అదీ ఆయన గొప్పదనమని శివరాజ్ కుమార్ తెలిపారు. మా నాన్న ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ కాగా నేను బాలయ్య క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. వయస్సు పెరిగే కొద్దీ బాలయ్యతో స్నేహం బలపడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

త్వరలో బాలయ్యతో కలిసి భారీ సినిమా చేయబోతున్నానని (Siva Rajkumar) శివరాజ్ కుమార్ అన్నారు. బాలయ్య నేను అన్నాదమ్ములమని ఆయన వెల్లడించారు. శివరాజ్ కుమార్ చేసిన కామెంట్స్ బాలయ్య అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య తర్వాత సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus