బిగ్ బాస్ హౌస్ లో మిసెస్ బిగ్ బాస్ మర్డర్ కేస్ టాస్క్ అనేది నడుస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ గా అమర్ దీప్, అర్జున్ ఉన్నారు. ఇంట్లో హత్యలు జరుగుతుంటాయి. వాటిని ఎవరు చేశారో కనిపెట్టాల్సి ఉంటుంది. మొదట సీక్రెట్ టాస్క్ శివాజీకి ఇచ్చారు. ఇందులో పల్లవి ప్రశాంత్ ని ఇంకా అశ్వినిని అవుట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. శివాజీ వారిద్దరినీ అవుట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ అవుట్ అయి దెయ్యంగా మారాడు. అలాగే అశ్విని కూడా దెయ్యంగా మారింది.
హౌస్ లో వీరిద్దరిని ఎవరు చంపారో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ శివాజీ మర్డరర్ అని తేల్చి చెప్పారు. దీంతో శివాజీ సీక్రెట్ టాస్క్ లో విఫలం అయ్యాడు. కెప్టెన్సీ రేస్ నుంచీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంకకి సైతం సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది చేయడంలో సక్సెస్ అయ్యింది ప్రియాంక. గౌతమ్ ని రేస్ నుంచీ తప్పించి, మర్డర్ చేసింది. ఇక మిగిలిన వాళ్లలోనే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రతిక ఇప్పటికే అర్జున్ దగ్గర తన గురించి చెప్పుకుంది.
ఈసారి అయితే నీ సపోర్ట్ కావాలని అడిగింది. అప్పడు సిట్యువేషన్ బట్టీ చూద్దాం అని అర్జున్ మాట దాటేశాడు. ఈ సీక్రెట్ టాస్క్ అనేది ప్రతిదీ పేపర్ వర్క్ తోనే నడుస్తోంది. కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కొన్ని వస్తువులు ఇచ్చి మరీ సీక్రెట్ టాస్క్ ని డిజైన్ చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్ చనిపోయిన తర్వాత శివాజీ పెద్ద డ్రామా ఆడాడు. ఎవరు చేసి ఉంటారంటావ్.., నేను అయితే చెప్తా కదా.. నన్నెందుకు రమ్మన్నారు. నాకేం తేలుసు అంటూ రతికతో కామెడీ గా రెచ్చిపోయాడు శివాజీ. అందుకే, పోలీసులకి ఈజీగా దొరికేశాడు. ప్రశాంత్ గోస్ట్ డ్రెస్ లో ఉన్నాడు.
ఎవరితో మాట్లాడకూడదు. చెప్తే తెలిసిపోతుంది. అందుకే మాట్లాడకూడదని చెప్పాడు. ఇప్పటి వరకూ అయితే ముగ్గురు హౌస్ లో చనిపోయారు. గౌతమ్ ఇంకా అశ్విని ఇంకా ప్రశాంత్ ఇలా ముగ్గురూ దెయ్యాలుగా మారారు. సో, ఈటాస్క్ అయితే మంచి ఫన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మిసెస్ బిగ్ బాస్ పార్టీ చేసుకున్న తర్వాత హౌస్ మేట్స్ ఫైనల్ గా ఈ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నారు. వచ్చేవారం నుంచీ ఫినాలే టిక్కెట్ టాస్క్ లు నడుస్తాయి. ఇది ఎవరు గెలుచుకుంటారో వాళ్లు నేరుగా (Bigg Boss 7 Telugu) టాప్ 5లోకి వెళ్లి ఫైనల్స్ లోకి అడుగుపెడతారు. మొత్తానికి అదీ మేటర్.