ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji) టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలీతో సరదాగా షోలో పాల్గొన్న శివాజీ మాయదారి మైసమ్మా మైసమ్మా సాంగ్ ను ఒక్కరోజులో షూట్ చేశామని తెలంగాణలో బోనాల సమయంలో ఇప్పటికీ ఈ పాట ప్లే అవుతుందని తెలిపారు. హీరోగా 70 సినిమాల్లో సహాయ నటుడిగా 26 సినిమాల్లో చేశానని శివాజీ వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాదితో 100 సినిమాలు పూర్తవుతాయని ఆయన తెలిపారు.
ఎనిమిదో తరగతి వరకు నాకు చెప్పులు లేవని శివాజీ కామెంట్లు చేశారు. మాస్టర్ (Master) నా తొలి సినిమా అని చిరంజీవి (Chiranjeevi) నేను ఎంతో అభిమానించే వ్యక్తి అని ఆయన తెలిపారు. నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి చిరంజీవి 10,000 రూపాయలు ఇవ్వగా ఆ డబ్బులు ఆరు నెలలు ఉపయోగపడ్డాయని శివాజీ పేర్కొన్నారు. ఈటీవీ సీఈవో బాపినీడు గారి వల్ల #90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో (90’s – A Middle-Class Biopic) ఛాన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
పెద్ద కొడుకు అలబామా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడని చిన్నోడికి అమెరికాలో పేరు పొందిన బిజినెస్ స్కూల్ లో సీటు వచ్చిందని శివాజీ పేర్కొన్నారు. అలీ చెప్పిన సూచనలు పాటించి ఇల్లు కట్టుకోవడంతో పాటు 30 ఎకరాల పొలం కొన్నానని ఆయన తెలిపారు. నిర్మాతగా 25 లక్షల రూపాయలు పోయాయని నాకు అప్పు అంటే భయమని శివాజీ వెల్లడించారు.
వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) , రాజ్ తరుణ్ (Raj Tarun) మూవీలో విలన్ గా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అలీ (Ali) నిలబడితే నేను అస్సలు ఒప్పుకోనని రాజకీయాల్లో ఖర్చు చేసిన డబ్బులు రావాలంటే ప్రకృతి వనరులు దోచుకోవాలని శివాజీ కామెంట్లు చేశారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఎన్నికల్లో పోటీ మాత్రం చేయొద్దని శివాజీ అలీకి సూచించారు. శివాజీ సూచనలను అలీ పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?