Sivaji: రెమ్యునరేషన్ గుట్టు విప్పిన శివాజీ.. నాకే హైయెస్ట్ అంటూ?

బుల్లితెర రియలిటీ షో బిగ్ బాస్ షో టాప్3 కంటెస్టెంట్లలో ఒకరిగా శివాజీ నిలిచారు. శివాజీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బిగ్ బాస్ షోకు శివాజీ పారితోషికం గురించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల గురించి సైతం శివాజీ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే తనకు ఎక్కువ పారితోషికం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో సీజన్7కు విజేతగా నిలవడం సంతోషాన్ని కలిగించిందని శివాజీ అన్నారు. పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ కు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నా మానిటైజ్ చేసుకోలేదని మానిటైజ్ చేసుకుంటే డబ్బులు వస్తాయని కూడా పల్లవి ప్రశాంత్ కు తెలియదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ తో పోల్చి చూస్తే నాకే ఎక్కువగా పారితోషికం దక్కిందని ఆయన తెలిపారు.

శివాజీ వారానికి 4 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని జోరుగా వినిపించింది. 15 వారాలకు ఆయన 60 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. పల్లవి ప్రశాంత్ పారితోషికం మాత్రం లక్ష రూపాయల కంటే తక్కువ కావడంతో శివాజీకి ఎక్కువ మొత్తం పారితోషికం దక్కింది. శివాజీ ప్రస్తుతం తను నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ తో బిజీ అవుతున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత (Sivaji) శివాజీకి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. పొలిటికల్ కామెంట్లు చేయడం ద్వారా కూడా శివాజీ వార్తల్లో నిలుస్తున్నారు. భవిష్యత్తులో స్పై అనే టైటిల్ తో షార్ట్ ఫిల్మ్ తీస్తానని చెప్పిన శివాజీ నిజంగానే షార్ట్ ఫిల్మ్ ను తీస్తారేమో చూడాలి. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus