బిగ్ బాస్ హౌస్ లో రెండోసారి శివాజీ స్కానింగ్ కోసం బయటకి రావడం జరుగుతోంది. భుజం నొప్పి ఉన్నా కూడా నేను బరిలోకి దిగుతా అని చెప్పి, కెప్టెన్సీ టాస్క్ లో అర్జున్ కోసం శివాజీ గేమ్ ఆడాడు. అమర్ – ప్రియాంక శివాజీ ఈ ముగ్గురే ఫైనల్ గా మిగిలారు. ఇక్కడే అమర్ శివాజీ సంచీని తాళ్లతో బలంగా లాగేసరికి భుజం నొప్పి ఎక్కువై వెంటనే ఆట నుంచీ తప్పుకున్నాడు. దీంతో అర్జున్ కూడా కెప్టెన్సీ రేస్ నుంచీ తొలగిపోవాల్సి వచ్చింది. అయితే, ఇక్కడ శివాజీ ఎఫోర్ట్స్ ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు.
ఇక మెడికల్ రూమ్ లో శివాజీకి ఇంకో సారి స్కానింగ్ చేయాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. దీనికోసం శివాజీని డాక్టర్స్ పర్యవేక్షణ కోసం హౌస్ నుంచీ బయటకి తీస్కుని రావాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. అంతేకాదు, ఆటలో కంటిన్యూ చేయకపోతే, శివాజీని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అలా చేస్తే ఈవారం డబుల్ ఎలిమినేషన్ అవ్వబోతోంది. నిజానికి శివాజీ గతంలోనే ఇలా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ, నాగార్జున స్పెషల్ రిక్వస్ట్ మీద, ఫిజియోథెరపీ చేయించుకుంటూ హౌస్ లో కంటిన్యూ అవుతూ వచ్చాడు.
ఫిజికల్ టాస్క్ ఆడేటపుడు మాత్రం బాగా ఇబ్బంది పడిపోతున్నారు. బాల్స్ టాస్క్ లో తన వంతు బాగానే గేమ్ ఆడాడు. గ్రూప్ గా కూడా మంచి డిస్కషన్స్ చేసి హౌస్ లో అందరూ గేమ్ ఆడేలా చూస్తున్నాడు. అందుకే, శివాజీని ఈ సీజన్ కి చేయి బాగోకపోయినా కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ హౌస్ లో ఉంచాలని చూస్తోంది. కానీ, ఇప్పుడు కండీషన్ సీరియస్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు.
అంతేకాదు, ఇక మిగిలింది కొద్ది వారాలు మాత్రమే కాబట్టి శివాజీ లేకపోయినా కూడా మిగతా హౌస్ మేట్స్ తో రియాలిటీ షోని రన్ చేస్కోవచ్చనే భావలో ఉంది బిగ్ బాస్ టీమ్. మరోవైపు హౌస్ మేట్స్ కూడా శివాజీ అలా ఉంటే గేమ్ ఆడేందుకు సంకోచిస్తున్నారు. అర్జున్ – అమర్ – గౌతమ్ – పల్లవి ప్రశాంత్ – యావర్ ఇలా బలంగా గేమ్ ఆడాలంటే మాత్రం శివాజీ మద్యలో ఉండకూడదనేది ఆడియన్స్ ఫీలింగ్. అలాగే అర్జున్ కూడా లాస్ట్ టైమ్ శివాజీ విషయంలో క్విక్ గా ఒక నిర్ణయానికి రమ్మని డైరెక్ట్ గా నాగార్జునకే చెప్పాడు.
అంతేకాదు, అర్జున్ రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి బయట (Sivaji) శివాజీ క్రేజ్ కూడా అతనికి బాగా తెలుసు. అయినా కూడా ఈమాట అన్నాడంటే నొప్పి ఎక్కువగానే ఉండచ్చని చాలామందికి అర్దమైంది.అలాగే, ఇప్పుడు అర్జున్ బదులు వేరేవాళ్లు ఆడేందుకు వీలు కూడా లేకుండా శివాజీ ఆడాల్సి వచ్చింది. యావర్ ప్లేయర్స్ ఎవరూ లేక స్వచ్ఛందంగానే తప్పుకున్నాడు. ఇక అమర్ బస్తాల టాస్క్ లో రెచ్చిపోయి ఆడి శోభశెట్టిని విన్నర్ ని చేసి కెప్టెన్ అయ్యేలా సాయం చేశాడు. అదీ మేటర్.