బిగ్ బాస్ హౌస్ లో మర్డర్ టాస్క్ హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. మిసెస్ బిగ్ బాస్ చనిపోయిందని ఇన్వెస్టిగేషన్ చేయమని అర్జున్ కి – అమర్ కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో వాళ్లిద్దరూ హౌస్ మేట్స్ ని అనుమానించడం మొదలుపెట్టారు. ఈ టాస్క్ లో శివాజీ కిల్లర్ అని చెప్పి, మరిన్ని హత్యలు చేయాలని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం శివాజీకి ఒక ఫోన్ కూడా ఇచ్చాడు. అక్కడ్నుంచీ శివాజీ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ వన్ మ్యాన్ షోగా ఈ టాస్క్ ని లీడ్ చేశాడు.
ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ని అవుట్ చేశాడు. తన మొక్కని పోస్ట్ బాక్స్ లో పెట్టి తనని చనిపోయేటట్లుగా చేశాడు. ఆ తర్వాత అశ్వినిని చంపాలని ఆదేశించాడు బిగ్ బాస్. దీనికోసం మిర్రర్ పై “Cry Baby Ashwini Get Out ” అని రాయాలని చెప్పాడు. ఒక పేస్ట్ తో ఎవరికంట పడకుండా ఈ కొటేషన్ రాసి అశ్వినిని మర్డర్ చేశాడు. దీంతో అశ్విని కూడా దెయ్యంగా మారిపోయింది. వరుసగా ఇలా హత్యలు జరుగుతుంటే ఎవరు చేస్తున్నారో తెలియక చాలాసేపు పోలీసులు అయిన అర్జున్ అమర్ తలలు పట్టుకున్నారు. ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేస్తూ ఎంటర్ టైన్ చేశారు.
కానీ, ఎప్పుడైతే ఇంటరాగేషన్ లో శివాజీ వచ్చాడో అప్పుడు ఫన్ వచ్చింది. అంతేకాదు, మద్య మద్యలో మీడియా రిపోర్టర్ శోభతో కూడా ఫన్నీగా మాట్లాడుతూ శివాజీ తనదైన స్టైల్లో ఈ టాస్క్ లో ఎంటర్ టైన్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ శివాజీకి గౌతమ్ ని కిల్ చేయాలని ఆదేశం ఇచ్చాడు. ఇందుకోసం ఐ యామ్ డెడ్ అనే స్టిక్కర్ ని గౌతమ్ వీపుకి అంటించాలని చెప్పాడు. కానీ, శివాజీ దీనికోసం చాలా సమయం తీస్కున్నాడు. ఈ టాస్క్ ని ఫినిష్ చేయలేకపోయాడు. అందుకే, బిగ్ బాస్ ప్రియాంకకి ఈ పని అప్పజెప్పాలని శివాజీని ఫోన్ లో ఆదేశించాడు. దీంతో ఫోన్ ని టాస్క్ ని ప్రియాంకకి అప్పజెప్పాడు బిగ్ బాస్.
ఈలోగా ఆఫీసర్స్ అనుమానం వచ్చిన రతికని జైల్లో వేశారు. ఎప్పుడైతే అశ్విని చనిపోయిందో అప్పుడు రిలీజ్ చేశారు. బిగ్ బాస్ అడిగినపుడు మాకు శివాజీపై అనుమానం ఉందని చెప్పి జైల్లో ఉంచారు. కాసేపు జైల్ కి వెళ్లకుండా ఆడుకున్నాడు శివాజీ. ఫైనల్ గా పోలీస్ ఆఫీసర్స్ జైల్లో శివాజీని ఉంచారు. అక్కడ కూడా మీడియాకి ఇంటర్య్వూ ఇస్తూ ఫన్ జనరేట్ చేశాడు శివాజీ. ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా టాస్క్ లో శివాజీ ఫుల్ గా రెచ్చిపోయాడు. మిగతా వాళ్లని కూడా ఆడిస్తూ తన గేమ్ బాగా ఆడాడు. మరోవైపు ప్రియాంక గౌతమ్ ని చంపేసింది. ఆ తర్వాత వాష్ రూమ్ దగ్గర ఉన్న హ్యాండ్ వాష్ లో టీ పోసి యావర్ ని చంపేసింది.
దీంతో యావర్ కూడా గోస్ట్ గా మారాడు. ఇలా నలుగురు టాస్క్ నుంచీ అవుట్ అయ్యారు. ఫైనల్ గా బిగ్ బాస్ అడిగినపుడు ఆఫీసర్స్ తగిన కారణాలు చెప్పలేకపోయినా శివాజీ పేరు చెప్పారు. దీంతో శివాజీ మర్డరర్ అని బిగ్ బాస్ కన్ఫార్మ్ చేశాడు. అయితే, అందర్నీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి శివాజీ ఒక్కరే కాదని, మరొకరు కూడా ఉన్నారని అన్నాడు. దీంతో పోలీసులు చాలాసేపు ఆలోచించి ప్రియాంక పేరు చెప్పారు. దీంతో శివాజీ – ప్రియాంక ఇద్దరూ కూడా సీక్రెట్ టాస్క్ ఆడినట్లుగా నిర్ధారించాడు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. ఇలా ఇద్దరూ పోలీసులకి దొరికిపోయి టాస్క్ లో ఫైయిల్ అయ్యారు.