సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోలందరూ కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ తోనే వారి ప్రయాణం మొదలుపెట్టారు. మరి కొంతమంది మూడు పూటలా అన్నం పెడితే చాలు అంటూ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్నగా అవకాశాలను అందుకొని అనంతరం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారు. తక్కువ రెమ్యూనరేషన్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 100 సినిమాలలో నటించినటువంటి వారిలో హీరో శివాజీ ఒకరు. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి శివాజీ బయటకు వచ్చారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు… ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎడిటింగ్ రూమ్లో తన ప్రయాణం మొదలు పెట్టానని తెలిపారు. అయితే తాను అబద్ధం చెప్పి ఇండస్ట్రీ లోకి వచ్చానని కూడా ఈయన వెల్లడించారు.
1996 సమయంలో కే ఎస్ రామారావు ఒక స్టూడియో పెట్టారు ఆ స్టూడియోలో ఆయన అన్ని కలవాలి అంటే కేవలం సినిమా కథ చెబుతాను అని చెబితేనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు. నేను కూడా తనని కలవాలని కథ చెప్పాలి అంటూ తన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాను. అక్కడికి వెళ్ళగానే సర్ నేను తప్పు చేశాను క్షమించండి నాకు కథలు చెప్పడం రాదు ఎడిటింగ్ వచ్చును ఉద్యోగం ఇవ్వండి సర్ అంటూ తనని వేడుకున్నాను
దీంతో రామారావు గారు భలేవాడివయ్యా అంటే నాకు ఉద్యోగం ఇచ్చారు. జీతం ఎంత ఇవ్వమంటావు అంటూ ఆయన నన్ను అడిగారు మూడు పూటలా అన్నం పెట్టండి బట్టలు కొనడానికి కొంచెం డబ్బు ఇవ్వండి సార్ అనడంతో వెంటనే క్యాషియర్ కి చెప్పినాకు 800 రూపాయలు ఇప్పించారు. అదే నా మొదటి రెమ్యూనరేషన్ అంటూ ఈయన వెల్లడించారు.