బిగ్ బాస్ హౌస్ లో పవర్ బాక్స్ ఓపెన్ చేసేందుకు జరిగిన రెండో టాస్క్ ( Break – Fast Task ) లో అమర్ – అర్జున్ గెలిచారు. ఫస్ట్ అర్జున్ వెళ్లి హ్యామర్ తో టైల్స్ ని బ్రేక్ చేసి కింద ఉన్న గోను సంచీని తీస్కుని అమర్ కి ఇచ్చాడు. ఆ తర్వాత అమర్ స్టైడ్స్ లో కర్రలని స్లోప్ ద్వారా పర్పెక్ట్ గా కింద ఉన్న క్లాంప్స్ లో అమర్చాడు. ఫస్ట్ అటెమ్ట్ లోనే మూడు వేసి ఆ తర్వాత అటెమ్ట్ లో రెండు వేసి మొత్తం ఐదు హోల్స్ ని ఫిల్ చేశాడు.
దీంతో టాస్క్ లో అమర్ – అర్జున్ అంటే ఎల్లో టీమ్ విజయం సాధించింది. దీంతో శివాజీ పట్టరాని సంతోషంతో గెలిచాడ్రా మొత్తానికి అంటూ అమర్ ని హగ్ చేస్కున్నాడు. అమర్ కూడా శివాజీని గట్టిగా కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శివాజీ సంబరాలు చేస్తూ అమర్ కి ముద్దులు పెట్టాడు. దీంతో అమర్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఈ వీడియోని తెగ షేర్లు చేస్తున్నారు. అయితే, ఇన్ని వారాల సమయంలో ఫస్ట్ టైమ్ శివాజీ అమర్ కోసం పాజిటివ్ గా మాట్లాడాడు. ఇక నీకు తిరుగులేదన్నట్లుగా చెప్పాడు. దీంతో అమర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
అయితే, ఇదే ఎపిసోడ్ లో (Bigg Boss 7 Telugu) అమర్ కి రతకకి పెద్ద మాటల యుద్ధమే జరిగింది. టాస్క్ కంటే ముందు స్టోర్ బెల్ మోగగానే గౌతమ్ తో పాటుగా అమర్ కూడా పరిగెత్తుకుంటూ స్టోర్ లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సంచీలని తీస్కుని వచ్చాడు. ఆపోజిట్ టీమ్ సంచీలు కిందపారేశాడు. దీంతో రతిక కింద ఎందుకు పారేశావ్ అంటూ నిలదీసింది. ఇది నాఇష్టం, నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ప్రతి వెధవ పని చేయడం దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టడం అంటూ రతిక గొణిగింది వార్నింగ్ లా మాట్లాడింది. దీంతో నీకంటే కాదు అంటూ నువ్వు చేసిన పనులకంటే కాదు, పోల్చద్దు అంటూ రెచ్చిపోయాడు.
అలాగే ఊస్తారు బయట అన్నాడు. దీనికి రతకకి ఒళ్లు మండింది. మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దిరికీ చాలాసేపు ఆర్గ్యూమెంట్ అయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత్ అంటూ రెచ్చిపోయారు. రతికతో నువ్వు భయపెడితే మేము భయపడతామా., పక్కకెళ్లి ఆడుకో అంటూ అమర్ రెచ్చిపోయాడు. నువ్వు వచ్చి నా బ్యాగ్ లాగేశావ్, దమ్ముంటే నీ గేమ్ నువ్వు ఆడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అమర్. ఇక ఈ ఎపిసోడ్ లో అమర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అలాగే అమర్ కి పాజిటివ్ అయ్యేలాగానే కనిపిస్తోంది. మరి చూద్దాం ఇది ఎంతవరకూ ఉపయోగపుడుతందనేది. అదీ మేటర్.