అనుదీప్ సినిమాల్లో ఉండే ఫన్ ఎలిమెంట్స్.. మిగిలిన సినిమాల్లో కనిపించవు. అదేదో బ్రహ్మాండమైన విషయం అని చెప్పడం లేదు కానీ.. అనుదీప్ రైటింగ్‌లో ఉన్న మజా అది. చిన్న చిన్న డైలాగ్‌లు, పంచ్‌లు, రియాక్షన్ల స్పెషల్ ఇది. ఇలాంటి సీన్స్‌తో రాసుకున్న సినిమానే ‘జాతిరత్నాలు’. ఆ సినిమా తర్వాత అనుదీప్ తమిళనాడు వెళ్లిపోయాడు. అక్కడ మోస్ట్ ప్రామిసింగ్ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేశాడు. అదే ‘ప్రిన్స్’. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దాని సంగతేంటో చూసేయండి మరి.
సుమారుగా చెప్పాలంటే.. ‘ప్రిన్స్’ సినిమా కథేంటో ట్రైలర్‌లో చూపించేశారు. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేదే సినిమా. కులం, మతం అంటూ ఎప్పుడూ గొడవపడే ఊళ్లో స్కూలు టీచరగా హీరో శివకార్తికేయన్ పని చేస్తుంటాడు. పిల్లలకు స్లిప్‌లు, బుక్స్ ఇచ్చి పరీక్షలు రాయిస్తుంటాడు. అయితే దాని వెనుక ఆయనకో థియరీ ఉంటుంది. అలా సాగుతున్న అతని జీవితంలో విదేశీ అమ్మాయి టీజర్‌గా వస్తుంది. కులం, మతం, వర్గం అని కొట్టుకునే ఊరు…హీరో చేసిన పనితో అంతర్జాతీయ వ్యవహారంలా చూస్తుంది.
ఇలాంటి సీన్స్ మధ్యలో భారతీయులు అంతా సోదరీ సోదరీమణులు అందుకే విదేశీ అమ్మాయిని ప్రేమించాననేది హీరో లాజిక్ చెబుతాడు. దీనికి కొంతమంది కన్విన్స్ అయితే.. ఇంకొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ‘‘కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరికీ ఒకటే రక్తం రా’’ అని సత్యరాజ్ అనడం.. దాంతోపాటు ‘నీ రక్తం ఏం రంగు రా’ అని మరొకరిని అడిగితే.. ‘నా బ్లడ్ కాస్త పింక్ కలర్‌లో ఉంది’ అంటూ కౌంటర్ పడుతుంది.
అలా మొదలయ్యే ట్రైలర్.. రకరకాల విచిత్రమైన డైలాగ్‌లతో ట్రైలర్‌ను నింపేశారు. ఇంతకీ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా. ఉక్రెయిన్ భామ మరియా రియాబోషప్క హీరోయిన్. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలు. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!