ఎస్.జె.సూర్య (SJ Suryah) నటుడిగా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఒకప్పుడు రైటర్ గా, దర్శకుడిగా సత్తా చాటిన ఇతను తర్వాత వరుస ప్లాపులు ఫేస్ చేయడం వల్ల డైరెక్షన్ కి దూరమయ్యాడు. అదే టైంలో ‘స్పైడర్’ (Spyder) ‘మెర్సల్’ వంటి సినిమాలు అతనికి విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల వల్ల ఎస్.జె.సూర్యకి వరుస ఛాన్సులు లభించాయి. హ్యాపీగా సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటూ నటుడిగా తమిళంలో బిజీగా ఉన్న సూర్యకి.. తెలుగులో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) రూపంలో ఓ మంచి ఆఫర్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో నాని కంటే ఎస్.జె.సూర్య (SJ Suryah) నటనకు మంచి మార్కులు పడ్డాయి అనేది వాస్తవం. ఈ సినిమా సక్సెస్ మీట్లకి వెళ్ళినప్పుడు.. ఎస్.జె.సూర్య ‘టాయిలెట్’ డైలాగ్ ఎక్కువగా చెప్పేవాడు. దయానంద్ అనే పాత్ర సూర్యని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంది. అందుకే ఎక్కడికి వెళ్లినా ఇదే డైలాగ్ ఎక్కువగా చెబుతున్నాడు. ఈరోజు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) టీజర్ లాంచ్ వేడుక లక్నోలో జరిగింది. ఈ వేడుకలో సూర్య స్పీచ్ అనంతరం జనాలు గోల చేస్తుంటే..
ఇక్కడ కూడా ‘టాయిలెట్స్ ఎక్కడున్నాయి అని నన్ను అడుగుతాడు ఏంటి సుధ వీడు’ అనే డైలాగ్ చెప్పాడు. వాస్తవానికి అతను ‘గేమ్ ఛేంజర్’ లో కీ రోల్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా డైలాగ్ చెప్పే అవకాశం ఉంది. అయినా సరే ‘సరిపోదా శనివారం’ డైలాగే చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వదులుతున్నారు నెటిజెన్లు. ‘మరికొన్ని నెలలు ఇదే డైలాగ్ తో సూర్య కానిచ్చేస్తాడేమో’ అంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు .
Prathi event lonoo idhe dialogue ah @iam_SJSuryah #GameChnagerTeaser #gamechanger #Ramcharan #sjsuryah pic.twitter.com/gmr0eRHwxp
— Phani Kumar (@phanikumar2809) November 9, 2024