Harish Shankar: ఒక్క మాటతో అభిమాని గాలి తీసేసిన హరీష్ శంకర్!

సీనియర్ కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) , మాస్ మహారాజ్ రవితేజతో  (Ravi Teja)  కలిసి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడం, అందులోనూ రీమేక్ సినిమా కావడంతో హరీష్ శంకర్ పైన అభిమానుల నుండి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అనుకున్న రీతిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ను ట్రోల్ చేశారు.

Harish Shankar

అప్పటి నుంచి హరీష్ శంకర్ చాలా మంది అభిమానుల ప్రశ్నలకు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ అభిమానుల్లో ఒకరు హరీష్ శంకర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. “అన్నా, రవితేజ గారితో మరో సినిమా చేయాలా, మా కాలర్ ఎగరవేయాలా?” అంటూ ప్రశ్నించగా, దీనికి హరీష్ శంకర్ ఘాటుగా స్పందించారు. “ఎన్నో విన్నాను తమ్ముడు, అందులో ఇది ఒకటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, నాకైనా, ఎవరికైనా,” అంటూ సమాధానం ఇచ్చారు.

హరీష్ శంకర్ రిప్లై వెంటనే వైరల్ అవుతుండటంతో, అభిమానులు ఆయన నిరీక్షణ, స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కథలను అందరికీ చేరవేయడంలో తనదైన శైలిని కలిగి ఉన్న హరీష్ శంకర్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో  (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కొంత మేరకు పూర్తయినప్పటికీ, పవన్ రాజకీయ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో హరీష్ శంకర్ కు మంచి హిట్ కొట్టాలి అన్న టార్గెట్ ఉంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్ అయితే, మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేయాలని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో స్టార్ కూడా హరీష్ శంకర్‌తో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో సమాచారం. మొత్తం మీద, హరీష్ శంకర్ తనకు వచ్చిన ప్రతి విమర్శనలతో పాటు అభిమానుల ప్రశ్నలను కూడా సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు. ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ట్రోలింగ్‌ కు సైతం కౌంటర్ ఇస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

ఆ హీరో ఇష్టం లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus