సినిమా అంటే ఇష్టం కొందరికి…సినిమా అంటే పిచ్చి మరికొందరికి…ఇక సినిమా అంటే ప్యాషన్ చాలా మందికి…ఇలా ఇష్టంతో, ప్యాషన్ తో, పిచ్చితో సినిమాల్లోకి వస్తున్నారు ఎందరో…అలా వచ్చిన చిన్న హీరోల్లో చాలామంది ఒకటి అరా….సినిమాలతో తెరమరుగు అయిపోతూ ఉన్నారు…అయితే తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయింది. పెద్ద హీరోల సినిమాలు రావడానికి సంవత్సరాలు పడుతున్న నేపథ్యంలో చిన్న సినిమాల జోరు బాగా ఊపందుకుంది. ప్రతి సంవత్సరం కొత్త హీరోలు, హీరోయిన్ల తో పాటు దర్శక, నిర్మాతలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే గత సంవత్సరం ‘పెళ్లిచూపులు’ చిన్న చిత్రమే అయినా..అనూహ్యంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ స్థాయిలో అవార్డు కూడా గెలుచుకుంది. అంతే కాదు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.. అయితే సినిమా కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా అభిమానులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది. ఈ మద్య తెగులు ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇక అదే కోవలో గత శుక్రవారం… చిన్న సినిమాలు మూడు సినిమాలు థియేటర్లో సందడి చేసినా ఏ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
అసలు ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్న న్యూస్ చాలా మందికి తెలియకపోవడం గమనార్హం…ఇంతకీ ఆ సినిమాలు ఏంటి…ఎవరెవరు నటించారు అంటే…మన ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి హీరోగా నటించిన తొలి సినిమా ‘జయదేవ్’. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళంతా. అయితే మొదటి సారిగా వెండి తెరకు పరిచయం అయిన రవి నటన పరంగా కాస్త బెటర్ అనిపించినా స్టోరీ పరంగా పెద్దగా ఆకర్షించలేక పోయారట. ఈ దెబ్బతో ఆ సినిమా డిజాస్టర్ గా మారిపోయింది….మరో పక్క తెలుగు ఇండస్ట్రీలో ‘హృదయకాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రం ‘వైరస్’. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ మొదటి నుంచి సోషల్ మీడియాలో సందడి చేసినా..థియేటర్లో వచ్చిన తర్వాత షరా మామూలే అన్నట్లిగా ఫ్లాప్ గా మారింది….సంపూర్ణేష్ బాబు అనగా కామెడీ బాగుంటుందని ఆశతో వెళ్ళిన వారికి నిరాశే మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ జీవిత కథతో రూపొందిన ‘ఖయ్యూం భాయ్’ చిత్రం అయితే అసలు వచ్చిందా…రాలేదా అన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి జూన్ నెలలో వీకేండ్ వచ్చిన సినిమాలు అన్నీ తుస్ మనిపించాయి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.