Sobhita Dhulipala: పాపులర్‌ సెలబ్రిటీల లిస్ట్‌ వచ్చింది.. టాప్‌ లిస్ట్‌లోకి చైతు ఫియాన్సీ

ఎక్కువ ప్రజాదరణ పొందిన / పొందుతున్న నటీనటుల జాబితాను ఐఎండీబీ తరచుగా విడుదల చేస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ నుండి ఇలాంటి లిస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో టాప్‌లో ఉన్న పేర్లు చూశాక.. ‘ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కసారి టాప్‌లోకి వచ్చేసిందిగా..’ అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే టాప్‌ లిస్ట్‌లో శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)    ఉంది కాబట్టి. ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో టాప్‌ 2లో నటి శోభిత ధూళిపాళ నలిచింది.

Sobhita Dhulipala

ఇక టాప్‌1లో బాలీవుడ్‌ యువ నటి శార్వరీ ఉంది. ఇటీవల టాలీవుడ్‌ యువ కథానాయుడు నాగచైతన్యతో  (Naga Chaitanya) శోభిత ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్‌ చేశారు. అలా ఆమె ఈవారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా నిలిచింది. ఇక శోభిత తర్వాత స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షా రుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఉన్నాడు. ఆ తర్వాత నాలుగో ప్లేస్‌లో కాజోల్‌ (Kaj0l).. ఐదో స్థానంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఉంది.

అందుకే శోభిత గురించి ఫ్యాన్స్‌ ‘ఎంగేజ్‌మెంట్‌లో టాప్‌లోకి వచ్చేసింది’ అంటున్నారు. అయితే అప్పటికే ఆమె అందరికీ బాగా పరిచయం ఉన్న నటే అనే విషయం మరికొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఏదైతేముంది టాప్‌లోకి వచ్చేసింది. ఇక నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత ఇటీవల షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది ‘‘మన పరిచయం ఎలా మొదలైనా.. ప్రేమలో మన హృదయాలు కలసిపోయాయి’’ అని అందంగా రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ కూడా చేశాడు.

ఈ పోస్టులకు తెగ లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. వీరి పెళ్లి తేదీ త్వరలో ప్రకటిస్తారని సమాచారం. ఇక శోభిత టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. ‘మంకీ మ్యాన్‌’ అంటూ హాలీవుడ్‌లో ఇటీవల ఓ సినిమా చేసింది. దేవ్‌ పటేల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది.

బాలయ్య అభిమానులకు శుభవార్త చెప్పిన బాబీ.. ఆ సర్ప్రైజ్ అప్పుడేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus