‘చిత్ర లహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్లతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి తేజ్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా భయంతో థియేటర్లకు దూరమయ్యి.. ఓటిటిలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్లకు రప్పించిన చిత్రమిది.నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు.. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ ‘ఓసారి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి’ అనే కోరికను మాత్రం జనాలకు క్రియేట్ చేసింది. దానినే ఈ చిత్రం క్యాష్ చేసుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవ్వడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫుల్ రన్ ముగిసింది.
ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే :
నైజాం | 4.25 cr |
సీడెడ్ | 2.10 cr |
ఉత్తరాంధ్ర | 1.58 cr |
ఈస్ట్ | 0.96 cr |
వెస్ట్ | 0.60 cr |
కృష్ణా | 0.69 cr |
గుంటూరు | 0.97 cr |
నెల్లూరు | 0.53 cr |
ఏపీ+తెలంగాణ | 11.68 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.55 cr |
ఓవర్సీస్ | 0.38 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 12.61 cr |
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.12.61 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఫైనల్ గా ఈ చిత్రం 3.01 కోట్ల వరకూ లాభాలను బయ్యర్స్ కు అందించిందని చెప్పొచ్చు.50శాతం ఆకుపెన్సీతోనే ఈ చిత్రం ఇంత కలెక్ట్ చేసింది. ఒకవేళ 100 శాతం ఆకుపెన్సీతో కనుక థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ముందుగానే పర్మిషన్ ఇచ్చి ఉంటే.. ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసుండేదనే చెప్పొచ్చు.
Click Here To Read Movie Review
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!