మంచు మోహన్ బాబు హీరోగా ‘బుర్రకథ’ ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ఈ ఏడాది సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అయిన సినిమాల్లో ఒకటి. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1 గంట 42 నిమిషాల నిడివి కలిగిన ఈ మూవీ ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన జనాలు డీసెంట్ టాక్ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు ఈ చిత్రంలో బాగా నటించారని, కాన్సెప్ట్ బాగుందని చెప్పుకొచ్చారు
అయితే వి.ఎఫ్.ఎక్స్ బాలేదని, కథనం వీక్ గా ఉందని చెప్పుకొచ్చారు.డీసెంట్ టాక్ వచ్చినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేకపోయింది. కోవిడ్ థర్డ్ వేవ్ తో థియేటర్ల ఆక్యుపెన్సీ సంక్రాంతి టైంలో 50 శాతానికి కుదించారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ టైంకి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. ఆ అవకాశాన్ని కూడా ‘సన్ ఆఫ్ ఇండియా’ క్యాష్ చేసుకోలేకపోయింది. అయితే విడుదలైన చాలా రోజుల తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీకి అమెజాన్ వారు మంచి రేటే చెల్లించినట్టు తెలుస్తుంది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీకి సర్వేష్ మురారి ఛాయాగ్రహణం అందించగా మోహన్ బాబు స్క్రీన్‌ప్లే విభాగానికి పనిచేయడం విశేషం. శ్రీకాంత్, మీనా, ప్రగ్యా జైస్వాల్ అలీ, తనికెళ్ల భరణి, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.