కరోనా రోజు రోజుకూ విస్తరిస్తూ ఉంటున్నప్పటికీ.. చాలా మంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎవ్వరూ ఇల్లు వదిలి బయటకి రావొద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కొందరు ఇలా ప్రవర్తిస్తూ ఉండడం.. గమనార్హం. ఇక ఈ విషయం గురించి..ప్రజలకు అవగాహన పెంచేలా… చిరంజీవి, చరణ్, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి స్టార్ లు ముందుకొచ్చి కొన్ని వీడియోలను చేసారు.
అంతే కాకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా.. తమ సినీ కుటుంబంలో కూడా ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా ఓ చారిటీ సంస్థను నెలకొల్పారు. మెగాస్టార్ అధ్యక్షతన రూపుదిద్దుకున్న ఈ సంస్థకు ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ అనే పేరుని పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి కూడా స్టార్లు అంతా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా… తాజాగా కరోనా వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ పాటను కంపోజ్ చేశాడు.
శ్రీనివాస్ మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను స్వయంగా కోటినే పాడగా….. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయితేజ్ కూడా గొంతు కలుపుతూ నటించడం విశేషం. ముఖ్యంగా వారి ఇంటి వద్ద నుండే ఈ పాటలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్