 
                                                        బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు ఢిల్లీ భామ రాశీ ఖన్నా, మరొకరు బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్. ఒక హీరోయిన్ తర్వాత మరొక హీరోయిన్ తో హీరో రొమాన్స్ చేసే సన్నివేశాలు చూసి బోర్ కొట్టిందేమో డైరక్టర్ కొత్తగా ప్లాన్ చేశారు. ఇద్దరి హీరోయిన్స్ తో మాస్ మహారాజ్ రొమాన్స్ చేసే సీన్ పెట్టారు. ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్ పాల్గొన్నారు.
ఈ షెడ్యూల్ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. మళ్లీ వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్‌లోనే మరో షెడ్యూల్ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. టచ్ చేసి చూడు మూవీలో రవితేజ కొత్తగా ఉంటారని, మాస్ అభిమానులకు ఈ మూవీ విందు భోజనం లాంటిదని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
