Sonia Agarwal: మరో దర్శకుడితో ప్రేమాయణం?

7/G బృందావన కాలనీ సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న సోనియా అగర్వాల్ ఆ తరువాత ఎందుకో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ఇక 2006 లో అదే సినిమా డైరెక్టర్ సెల్వా రాఘవన్ ను వివాహం చేసుకొని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఫ్యామిలీ లైఫ్ తో అంతా హ్యాపీగా కొనసాగుతోంది అనుకున్న క్రమంలో ఆమె ఆ దర్శకుడి నుంచి విడాకులు తీసుకుంది. 2010లో విడాకుల అనంతరం ఒంటరిగానే ఉంటున్న

సోనియా మధ్యలో కొన్ని చిన్న సినిమాలతో మళ్ళీ హీరోయిన్ గా తన లక్కుని టెస్ట్ చేసుకుంది. కానీ ఆ సినిమలేవి కూడా అమ్మడికి అంతగా హెల్ప్ అవ్వలేదు. ఆ మధ్యలో టెంపర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో దర్శనమిచ్చింది. ఇక చాలా కాలంగా సోనియా రెండో పెళ్లిపై కూడా రూమర్స్ వస్తున్నాయి.సోనియా అగర్వాల్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల మరొక కొత్త రూమర్ వైరల్ గా మారింది.

ఒక యివ దర్శకుడితో ఆమె గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వయసు కూడా మించిపోతుండడంతో అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోందట. మరి ఈ కథనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక తమిళ్ సినిమాతో పాటు తెలుగులో కూడా సహా నటిగా కొన్ని సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus