సూపర్ స్టార్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చిన తర్వాత ఆ పదానికి కొత్త అర్ధం తోడు అయింది. డబ్బులున్నవాడు కాదు.. ఆ ధనాన్ని పేదల కోసం ఖర్చు పెట్టేవాడే శ్రీమంతుడు అని కొరటాల శివ ఈ చిత్రం ద్వారా చెప్పారు. తెర పై చెప్పిన విషయాన్నీ మహేష్ బాబు రియల్ గా చేసి చూపించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. అలా ప్రిన్స్ పలువురికి ఆదర్శ ప్రాయుడయ్యారు. సినీ నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు కూడా పేద గ్రామాలను స్మార్ట్ సిటీలుగా మార్చడానికి అడుగు ముందుకు వేశారు.
ఈ జాబితాలోకి నటుడు సోను సూద్ చేరారు. అరుంధతి సినిమాలో భీకరమైన విలనిజం చూపించిన అతను, నిజ జీవితంలో మంచి మనసున్న వ్యక్తిగా చాటుకున్నారు. తన స్వరాష్ట్రమైన పంజాబీ లోని మారు మూల గ్రామం “బాహోన” ను దత్తత తీసుకున్నారు. ఆ ఊరికి ప్రధానంగా మంచి నీళ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశుభ్రతపై ద్రుష్టి పెట్టారు. ఇదివరకే పంజాబ్ లో తాను పుట్టి పెరిగిన “మోగా” నగరంలో యువకులకు సోను సూద్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు “బాహోన” గ్రామం బాగోగులు చూడడంతో ఆ గ్రామ ప్రజలకు సోను రియల్ హీరో అయ్యారు.